Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ప్రత్యేకంగా టైమ్స్ స్వ్కేర్..

ఇప్పుడంటే అందరూ హైటెక్ సిటీ అని చెబుతున్నారు కానీ.. ఓ 30 ఏళ్ల కిందటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్

By:  Tupaki Desk   |   12 July 2024 11:33 AM GMT
హైదరాబాద్ కు ప్రత్యేకంగా టైమ్స్ స్వ్కేర్..
X

ఇప్పుడంటే అందరూ హైటెక్ సిటీ అని చెబుతున్నారు కానీ.. ఓ 30 ఏళ్ల కిందటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్. చార్మినార్ అంటే హైదరాబాద్. ఇక ప్రతి నగరానికీ ఒక ఐకానిక్ సింబల్ ఉన్నట్లే.. భాగ్య నగరానికీ అప్పట్లో చార్మినార్.. ఇప్పుడు హైటెక్ సిటీ ప్రత్యేకతలుగా నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా టైమ్స్ స్వ్కేర్ రానుంది.

న్యూయార్క్ తరహాలో..

అమెరికాకే కాదు ప్రపంచ ఆర్థిక రాజధాని ఏదంటే న్యూయార్క్ అని చెప్పాలి. అగ్ర రాజ్యంలోని న్యూయార్క్ కు ఎంత గొప్ప పేరుందో.. అక్కడి టైమ్స్ స్వ్కేర్ కూ అంతే ప్రాధాన్యం ఉంది. ఎందరో పర్యటకులు అక్కడకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ట్రావెలర్స్ కూడా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ ను సందర్శిస్తుంటారు. కాగా, అలాంటిదే హైదరాబాద్ లోనూ ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం టి-స్క్వేర్‌ ను ప్రకటించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) రాయదుర్గం ప్రాంతంలో టి-స్క్వేర్ నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌ లు- లావాదేవీల సలహాదారుల కోసం టెండర్లు జారీ చేసింది. తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని ప్రదర్శించే ఆర్కిటెక్చరల్ అద్భుతంగా టి-స్క్వేర్ ఉండనుంది. మల్టీ ఫంక్షనల్ ప్లాజా ఆవశ్యకతను నొక్కి చెబుతూ టెండర్లు పిలిచింది. కాగా, ఆర్టీసీ, మెట్రో రైలు ద్వారా మంచి రవాణా సంబంధాలు ఉన్నప్పటికీ, రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు, సౌకర్యాల కొరత ఉంది. దీంతో ప్రజలకు వినోదం, సౌకర్యం, విశ్రాంతి కోసం ఒక హబ్‌ ను రూపొందించడానికి టి-స్క్వేర్‌ నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన. ప్రాజెక్ట్ పర్యావరణ అనుకూల స్థలాలను ఏర్పాటు చేయడం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, గ్రీనరీ సృష్టించడంపై దృష్టిసారిస్తుంది. రాయదుర్గంలో లో ప్రజలకు వినోదం, ఆకర్షణీయ హబ్‌ గా ఉండే ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం టి-స్వ్కేర్ కానుంది. ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ప్లాన్, సరైన నిర్మాణాలను ప్రతిపాదించాలని, టీజీఐఐసీకి తగిన డెవలపర్‌ ను కనుగొనడంలో సహాయపడాలని బిడ్డింగ్ సలహాదారులను కోరింది. ఓవైపు చార్మినార్, మరోవైపు హుస్సేన్ సాగర్, సైబర్ టవర్స్ తరహాలో ఈ ప్రాజెక్టును నగరంలోనే ప్రధాన ల్యాండ్‌మార్క్‌ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.