Begin typing your search above and press return to search.

హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు.. ఇక ఆ పని కూడా వారిదే!

సినీనటుడు నాగార్జున "ఎన్-కన్వెషన్" కూల్చివేత ఘటన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చర్చ బలంగా నడిచింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:04 AM GMT
హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు.. ఇక ఆ పని కూడా వారిదే!
X

తెలంగాణ రాష్ట్రంలో.. ప్రధానంగా హైదరాబాద్ లో ఇటీవల సంచలనాల్లో "హైడ్రా" ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. హైదరాబాద్ లో హైడ్రా సంచలనాలు ఆ స్థాయిలో ఉంటున్నాయి. సినీనటుడు నాగార్జున "ఎన్-కన్వెషన్" కూల్చివేత ఘటన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చర్చ బలంగా నడిచింది.

ఈ సమయంలో జీ.హెచ్.ఎం.సీ. చట్ట సవరణ చేయడంతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయని అంటున్నారు. ఇందులో భాగంగా... హైదరాబాద్ మహానగరంలో స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

అవును... తాజాగా జీ.హెచ్.ఎం.సీ. చట్ట సవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయని అంటున్నారు కమిషనర్ రంగనాథ్. దీంతో... అనధికారిక కట్టాడల కూల్చివేత అధికారం కూడా హైడ్రాకు లభించిందని అన్నారు. సిటీలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీ.హెచ్.ఎం.సీ చట్టంలోని అధికారాలు బదిలీ చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయని అంటున్నారు రంగనాథ్. ఫలితంగా... ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... కూల్చివేతలు, స్వాధీనం చేసుకొవడాలు వంటి అధికారాలు హైడ్రాకు లభించాయని తెలిపారు.

ఇదే క్రమంలో... పురపాలక చట్టం ప్రకారం.. అవుటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.ఆర్.) పరిధిలోని 27 మున్సిపాలిటీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని తెలిపారు! దీంతో.. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రానున్న రోజుల్లో హైడ్రా దూకుడు మరింతగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో మరెని సంచలనాలకు వేదికవుతుందో చూడాలి!