Begin typing your search above and press return to search.

ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి ముందు ఆ భూముల్లో అక్కినేని ఫ్యామిలీ ఏం చేసేది?

రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి.. అందరి చూపు హైదరాబాద్ మీద పడటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Aug 2024 5:15 AM GMT
ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి ముందు ఆ భూముల్లో అక్కినేని ఫ్యామిలీ ఏం చేసేది?
X

రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి.. అందరి చూపు హైదరాబాద్ మీద పడటం తెలిసిందే. హైడ్రాతో జరుగుతున్న హడావుడి ఒక ఎత్తు.. ఎంత పెద్ద వారి భూమి అయినా సరే.. అక్కడ అక్రమ నిర్మాణాన్ని కట్టి ఉంటే వాటిని కూల్చేయటం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున హైటెక్ సిటీకి దగ్గర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయటం తెలిసిందే.

నిబంధనలకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కట్టలేదని కింగ్ నాగార్జున పదే పదే చెబుతున్నారు. మరి.. ఇంత బల్లగుద్ది మరీ వాదిస్తున్న నాగార్జునకు ఒకే ఒక్క సూటి ప్రశ్న అంటూ కొందరు సంధిస్తున్నారు. వారి ప్రశ్న ఏమంటే.. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారన్నది నాగ్ ను అడుగుతున్నారు. అది అక్రమ కట్టడంగా జీహెచ్ఎంసీ ఎప్పుడో తేల్చేసింది. అయితే.. దీని మీద కోర్టు పంచాయితీ నడుస్తుందని చెబుతారు. ఈ విషయాల్ని పక్కన పెట్టి.. గతంలోకి జారిపోతే.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది.

ఎన్ కన్వెన్షన్ కు ఎంతో ముందు నుంచి ఆ భూములు.. అక్కినేని కుటుంబంలో ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో రైతుల నుంచి సేకరించిన భూమిలో వ్యవసాయం చేసే వారు. బియ్యంతో పాటు పలు కూరగాయల్ని.. ఆకుకూరుల్ని పండించినట్లుగా చెబుతున్నారు. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హయాంలోనూ.. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి కొన్ని దశాబ్దాల క్రితం షూటింగ్ లేని వేళలో.. ఆ ప్రాంతానికి వెళ్లి చిన్నపాటి రూంను నిర్మించారు. అక్కడ ఉంటూ.. వ్యవసాయ పనులు చూసుకునే వారు. మారిన కాలంతో పాటు.. కొత్త అవసరాలు తెర మీదకు వచ్చాయి. అక్కడి భూములు చూస్తుండగానే కోట్లాది రూపాయిలుగా మారాయి. దీంతో.. ఎన్ కన్వెన్షన్ పేరుతో ఒక భారీ నిర్మాణాన్ని నిర్మించారు. అదీ సంగతి.