'ఎన్' కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమీషనర్ కామెంట్స్ వైరల్!
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి దృష్టి సారించారని.. సీఎం అయ్యాక సెట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Aug 2024 12:16 PM GMTఈ రోజు (శనివారం) ఉదయం తెల్లవారినప్పటి నుంచి అన్నట్లుగా మాదాపూర్ లోని ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించి "ఎన్" కన్వెషన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి దృష్టి సారించారని.. సీఎం అయ్యాక సెట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో.. ఈ కూల్చివేత పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఈ కూలిచివేత చట్ట విరుద్ధంగా.. లేదా, తప్పుడు సమాచారంతో జరిగిందని అన్నారు. అనంతరం కోర్టుకు వెళ్తామని చెప్పారు.. కోర్టుకి వెళ్లడం వల్ల తనకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఈ సమయంలో ఉన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా... ఈ కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో... ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ సర్కార్ పక్కా ఆధారాలు లేకుండానే ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందా అనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... మాధాపూర్ లోని ఎన్ కన్వెషన్ కూల్చివేత విషయం ఎంత వైరల్ అయ్యిందనే సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు రాజకీయ, ఇటు సినిమా రంగంలో ఇదే హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నాగార్జున హైకోర్టుకు వెళ్లడం.. హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ స్పందించారు.
ఇందులో భాగంగా... నిర్మాణానికి జీ.హెచ్.ఎం.సీ. నుంచి అనుమతులు లేవని.. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీం (బీఆరెస్స్) కింద అనుమతుల కోసం ఎన్ కన్వెషన్ ప్రయత్నించిందని.. అయితే సంబంధిత అధికారులు ఈ బీఆరెస్స్ స్కీం కింద అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు.
కాగా.. తుమ్మడికుంటపై 2014లో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో... నోటిఫికెషన్ తర్వాత యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. వ్యవహారం అంతా చట్టబద్ధంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది అని రంగనాథ్ వివరించారు.