Begin typing your search above and press return to search.

వైసీపీని వెన్నంటే ఐ ప్యాక్ టీమ్!

ఐ ప్యాక్ టీమ్ ప్యాకప్ చెప్పేసిందని వైసీపీ కూడా వారికి శాశ్వత సెలవు చీటి రాసిచ్చేసింది అని అంతా అనుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Nov 2024 2:09 PM GMT
వైసీపీని వెన్నంటే ఐ ప్యాక్ టీమ్!
X

ఐ ప్యాక్ టీమ్ అంటే రాజకీయాలతో సంబంధం లేని కొందరు టీమ్ గా ఏర్పడి జనాభిప్రాయం పేరుతో చేసే సర్వేలు ఇచ్చే సలహాలు సూచనలు. ఇవి వైసీపీ కొంప కొల్లేరు చేసి పారేశాయి అన్నది వైసీపీలో ప్రతీ ఒక్కరి భావన. బయట గ్రౌండ్ లెవెల్ లో మ్యాటర్ వెరీ సీరియస్ గా ఉంటే అంతా బాగుంది అన్న ఫీల్ ని వైసీపీ హై కమాండ్ కి కలిగించి టోటల్ గా టైటానిక్ షిప్ మాదిరిగా పార్టీని ముంచేశారు అని వైసీపీ లో అంతా బాధపడ్డారు.

ఇక పార్టీ అధినాయకత్వానికి పార్టీ క్యాడర్ కి మధ్యలో ఐ ప్యాక్ టీమ్ ఒక అతి పెద్ద అడ్డు కట్టగా మారింది అన్న ఆవేదన చాలా మందిలో ఉంది. వాలంటీర్లను నమ్ముకోమని పార్టీ క్యాడర్ తో కాకుండా వారితోనే అంతా చేయించుకోమని ఒక భస్మాసుర హస్తం లాంటి సలహాను ఇచ్చింది కూడా ఐ ప్యాక్ టీమ్ అని అంటూ వచ్చారు.

దాని వల్లనే పార్టీలో జవం జీవం అంతా పోయింది. పార్టీ క్యాడర్ నిస్తేజం అయిన చోట వాలంటీర్లు అంతా ఎన్నికల వేళలో సైడ్ అయిపోయిన క్రమంలో ఏ ఆయుధం లేకుండా ఎన్నికల మహా సంగ్రామంలో పాల్గొని చిత్తు చిత్తు అయిన నేపధ్యం కళ్ళ ముందరే ఉంది.

ఐ ప్యాక్ చేసిన ఈ నిర్వాకానికి కళ్ళకు గంతలు కట్టి అధినాయకత్వాన్ని రాంగ్ రూట్ లో నడిపించిన దానికి ఎవరూ తిరిగి ఆ సేవలను ఉపయోగించుకోరు అనే అంతా అనుకున్నారు. ఐ ప్యాక్ టీమ్ ప్యాకప్ చెప్పేసిందని వైసీపీ కూడా వారికి శాశ్వత సెలవు చీటి రాసిచ్చేసింది అని అంతా అనుకున్నారు.

అయితే ఇపుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏంటి అంటే మళ్ళీ ఐ ప్యాక్ టీమ్ వైసీపీ బంధం ఏర్పరచుకుందని. గత అయిదేళ్ళలో వైసీపీ అధినాయకత్వానికి ఐ ప్యాక్ టీమ్ ఇచ్చిన సలహాలు సూచనలు కానీ ఏ ఒక్కటీ సరైన ఫలితాలు ఇవ్వలేదని తెలిసి మళ్లీ ఎలా పెట్టుకుంటున్నారు అన్న ప్రశ్న కూడా ఉంది.

అయితే అది ఆ పార్టీ ఇష్టం కాబట్టి ఐ ప్యాక్ టీమ్ మళ్లీ ఎంట్రీ ఇస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే ఐ ప్యాక్ టీమ్ వైసీపీకి చిన్న చిన్న పనులను చేసి పెడుతోందిట. ఇక వైసీపీని తిరిగి పునర్నిర్మించేందుకు పార్టీ అధినేత జగన్ కి సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ నియమించబడ్డారు.

ఇక వైసీపీ వాలంటీర్లను నమ్ముకుని పార్టీని పూర్తిగా గాలికి వదిలేసింది అని అంటున్నారు. ఎక్కడ చూసినా సవ్యంగా పార్టీ నిర్మాణం అన్నది జరగలేదని అంటున్నారు. అసలు సభ్యత్వ నమోదు ప్రక్రియ అన్నది కూడా లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐ ప్యాక్ టీమ్ మళ్లీ వైసీపీకి ఏ రకమైన సేవలు అందిస్తుంది అన్న చర్చ అయితే మొదలైంది.

వాలంటీర్లు పేరిట వైసీపీ తీవ్రంగా నష్టపోయింది అని అంతా అంటున్నారు. వారికి అయిదు వేలు వైసీపీ హయాంలో ఇస్తూ వచ్చారు. పది వేల రూపాయలు ఇస్తామని కూటమి పెద్దలు ప్రకటించడంతో వారంతా ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అటు వైపు మొగ్గారు. దాంతో వైసీపీ రెండిందాలుగా చెడింది.

ఇపుడు ఐ ప్యాక్ వాలంటీర్ల వ్యవస్థ మాదిరిగా మరేదైనా కొత్త సలహాను ఇస్తుందా అన్నది కూడా చర్చ సాగుతోంది. ఏది చేసినా ఏ సలహా ఇచ్చినా క్యాడర్ తోనే పార్టీ అంతా ముడిపడి ఉండాలని అంటున్నారు. క్యాడర్ ని దూరం పెడితే కచ్చితంగా అది బెడిసి కొడుతుందని 2024 ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు. నేల విడిచి సాము చేసిన వైసీపీ ఆ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడింది. మరి ఇపుడు ఐ ప్యాక్ సేవలను ఏ విధంగా వాడుకుంటుంది వైసీపీని ఐ ప్యాక్ టీమ్ ఏ సర్వీస్ తో అలరిస్తుంది, జనాల ముందు ఆకట్టుకునేలా ఎలా నిలబెడుతుంది అన్నది వేచి చూడాల్సిందే.