Begin typing your search above and press return to search.

గాల్లో ఉన్న యుద్ధ విమానం నుంచి సామాగ్రి జారిపడింది.. ఐఏఎఫ్ ట్వీట్ వైరల్!

ఇందులో భాగంగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాల్లో ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు తెరపైకి వచ్చేవి.

By:  Tupaki Desk   |   21 Aug 2024 1:47 PM GMT
గాల్లో ఉన్న యుద్ధ విమానం నుంచి సామాగ్రి  జారిపడింది.. ఐఏఎఫ్  ట్వీట్  వైరల్!
X

విమానాలు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అయిపోయిన ఘటనలు ఇటీవల కాలంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాల్లో ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు తెరపైకి వచ్చేవి. ఆ సమయంలో ప్రయాణికుల ఫోన్లు, హ్యాడ్ బ్యాగ్స్ వంటివి కింద పడిపోయేవి. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

అయితే తాజాగా భారత్ కు చెందిన ఓ యుద్ధ విమానం గగనతలంలో ఉన్న సమయంలో ఉన్నపలంగా అందులోని సామాగ్రి పడిపోయింది. అయితే యుద్ధవిమానంలో ఉన్న సామాగ్రి అంటే పలు సందేహాలు రావొచ్చు. అందులో పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు రావొచ్చు. అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించి అలాంటిది ఏమీ లేదని తెలుస్తోంది. ఇది రాజస్థాన్ లో జరిగింది.

అవును... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఓ యుద్ధవిమానం గగనతలంలో ఉండగా అనుకోని పరిస్థితి ఎదురైంది. ఆ విమానం ప్రయాణిస్తున్న సమయంలో అందులో నుంచి అకస్మాత్తుగా సామాగ్రి జారి పడింది. ఇలా ఒక్కసారిగా సామాగ్రి కింద పడటంతో అక్కడ పెద్ద శబ్ధం వచ్చిందంట. దీంతో.. ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్థానికులు అక్కడకు చేరారు. అక్కడ ఓ వస్తువు ముక్కలు కనిపించినట్లు చెబుతున్నారు.

బుధవారం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సామాగ్రి జారిపడిన ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అంటున్నారు. స్థానిక పోలీసులు ఆ సామాగ్రి జారిపడిన ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ లో స్పందించింది.

ఇందులో భాగంగా... సాంకేతిక లోపం కారణంగా ఈ రోజు పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ఏరియా సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎయిర్ స్టోర్ అనుకోకుండా విడుదలైందని తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు అని పేర్కొంది.