Begin typing your search above and press return to search.

ఏపీలో ఐఏఎస్ ల కొరత ఎంత తీవ్రంగా ఉందంటే..?

ఐపీఎస్ అధికారుల కొరతా ఎక్కువగానే ఉందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదని తెలుస్తోంది!

By:  Tupaki Desk   |   7 Feb 2025 8:39 AM GMT
ఏపీలో ఐఏఎస్ ల కొరత ఎంత తీవ్రంగా ఉందంటే..?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్దేశించిన కేడర్ స్ట్రెంత్ ప్రకారం 239 మంది ఐఏఎస్ అధికారులు ఉండాల్సి ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన వారిని కలుపుకున్నా ప్రస్తుత స్ట్రెంత్ 191 మాత్రమే. ఈ స్థాయిలో ఐఏఎస్ అధికారుల కొరత ఉండగా.. ఐపీఎస్ అధికారుల కొరతా ఎక్కువగానే ఉందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదని తెలుస్తోంది!

అవును... ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆరెస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని అంటున్నారు. ఈ విషయంపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినా అక్కడ నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. 2024 నవంబర్ 4న నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్, నలుగురు ఐఆరెస్ అధికారులను రాష్ట్రానికి డిప్యుటేషన్ పై పంపాలని ప్రధానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖరాశారు.

దీనికి కేంద్రం స్పందించలేదు. దీంతో... గత ఏడాది డిసెంబర్ 25న చంద్రబాబు మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా... ఏపీకి మానవనరుల కొరత తీవ్రంగా ఉందని.. ప్రధానంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కొరత మరీ ఎక్కువగా ఉందని.. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞులైన పలువురు సీనియర్ లెవెల్ అధికారుల అవసరాన్ని తెలుపుతూ చంద్రబాబు, ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇలా తమకు ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన అధికారుల కొరత తీవ్రంగా ఉందని.. డిప్యూటేషన్ పై కొందరు అధికారుల్ని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్వయంగా రెండుసార్లు లేఖ రాసినా.. దాన్ని ఫాలో అప్ చేసే విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల వైఫల్యం కూడా దీనికి ముఖ్యకారణం అని అంటున్నారు.