బాబు ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్... ఎవరీ రవిచంద్ర?
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఎంవో లు చంద్రబాబు తన ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుంటున్నారు
By: Tupaki Desk | 13 Jun 2024 8:10 AM GMTఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఎంవో లు చంద్రబాబు తన ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి స్థానంలో నీరభ్ కుమార్ ప్రసాద్ ని నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు.
అవును... ఏపీ సీఎంవో లో బాబు మార్కు టీం నియమించబడుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా కీలక పోస్టుల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులవ్వగా... సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మెరకు తక్షణం బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.
వాస్తవానికి ఏడాది కాలంగా ఎటువంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర. గత ప్రభుత్వంలో వేరు వేరు డిపార్ట్మెంట్ లలో పనిచేసిన రవిచంద్ర... సుమారు ఏడాది కాలంగా ఏ పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్నారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన వేళ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈయన సమార్ధతపై నమ్మకం ఉన్న చంద్రబాబు.. తన టీం లోకి ఈయనకు కచ్చితంగా తీసుకోవాలని ముందుగానే భావించారంట. ఇందులో భాగంగ... ఈ నెల 5నే ఆయనను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించాలని చంద్రబాబు ఆదేశించారని అంటారు. అయితే ప్రమాణస్వీకారం కాకపోవడంతో ఆయనకు అధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదని అంటున్నారు! ఈ సమయంలో బుధవారం ప్రమాణస్వీకార ఘట్టం పూర్తవ్వడంతో సీఎస్ ఉత్తర్వ్యులు జారీచేశారు!
కాగా... 1996 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ముద్దాడ రవిచంద్ర.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ (కోవిడ్ - 19 నిర్వహణ & టీకా) ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు.