ఇది సక్సెస్ అయితే బాబును మిగిలిన రాష్ట్రాలూ ఫాలో కావాల్సిందే..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మద్యం వ్యాపారం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Oct 2024 4:48 PM GMTఏపీలో నూతన మద్యం విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసింది. దీని ప్రకారం.. మద్యం వ్యాపారా న్ని ప్రభుత్వం కాకుండా .. ప్రైవేటుకు అప్పగించారు. తద్వారా లాభ నష్టాలతో సంబంధం లేకుండా.. సర్కారు మద్యంపై నియంత్రణను చేసేందుకు అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన., ముఖ్యంగా చంద్రబాబు ఆలోచన కూడా ఇదే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మద్యం వ్యాపారం చేస్తున్నాయి.
గతంలో వైసీపీ కూడా ఇదే పనిచేసింది. బీహార్, తమిళనాడు, కర్ణాటకలో కూడా ప్రభుత్వం మద్యం వ్యాపా రం చేస్తోంది. అయితే.. ఇప్పుడు ఏపీలో విధానం పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ విధానంతో ప్రభు త్వానికి లాభంతోపాటు.. ప్రైవేటుకు ఉపాధికల్పన విషయంలోనూ చొరవ తీసుకున్నట్టు అయిందన్న భావన కూడా ఉంది. దీంతో ఏపీ సర్కారు అమలు చేస్తున్న నూతన విధానంపై దేశంలో చర్చగా మారింది. ఇక, ఇప్పుడు 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారు.
దీనికి సంబంధించి కూడా కంపెనీలు రావడం..సరుకును పంపించడం చేశాయి. వాస్తవానికి గత ఐదేళ్లలో ప్రైవేటు మద్యం లేకపోయినా..ప్రభుత్వమే ధరలు పెంచి మద్యాన్ని విక్రయించింది. ఇది చిన్నపాటి కూలీలు, కార్మికులకు.. ఇబ్బందిగా మారి... జేబులు తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో సర్కారుపై వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇలాంటివారినే దృష్టిలో పెట్టుకుని 99 రూపాయలకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
దీపావళి నుంచి ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు సర్కారు పేర్కొన్న నేపథ్యంలో రూ.99కే ఇచ్చే మద్యం కనుక నాణ్యతలో ఎలాంటి రాజీ పడకపోతే.. అది సర్కారుకు క్షేత్రస్థాయి కార్మిక వర్గాల్లో మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఇక, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం తక్కువలో తక్కువ.. రూ.140 వరకు మద్యం బాటిల్ అమ్ముతున్నారు. ఏపీలో కనుక రూ.99 మద్యం సక్సెస్ అయితే.. వారు కూడా ఈ విషయంలో ఏపీని ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.