Begin typing your search above and press return to search.

తెలంగాణా బీజేపీలో బీ ఫారం ఇస్తే ఉంటారా...ఉండరా...?

మరో వైపు చూస్తే మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్ లాంటి పెద్ద నాయకులు పోటీకి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకోవడం కూడా బీజేపీని కలవరపెడుతోంది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:12 AM GMT
తెలంగాణా బీజేపీలో బీ ఫారం ఇస్తే ఉంటారా...ఉండరా...?
X

తెలంగాణా బీజేపీ నుంచి ఒక్కసారిగా బయటకు జనాలు జంప్ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ దారి ఎంచుకుంటున్నారు. దాంతో ఇపుడు తెలంగాణా బీజేపీకి ఒక భయం పట్టుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణాలో బీజేపీ నేతలు పెద్దగా దాన్ని లెక్కలోకి తీసుకోవడంలేదు అని అంటున్నారు.

దానికి కారణం కేంద్ర ప్రభుత్వం పదవీ కాలం సైతం దాదాపుగా పూర్తి కావచ్చింది అని అందరికీ తెలుసు. కేవలం నాలుగు నేలలు సమయం మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు ఉంది. దాంతో చాలా డేరింగ్ గా ఇతర పార్టీలలోకి ఫిరాయించేస్తున్నారు.

ఇక తెలంగాణా బీజేపీకి అభ్యర్ధులు పోటీ చేయడానికి కరవు అయ్యారని తరచూ బీయారెస్ విమర్శిస్తూ ఉంటుంది. దీని మీద బీజేపీ నేతలు ఎదురు దాడి చేసినప్పటికీ ఒక్కోసారి వారికి వారికే డౌట్లు కూడా వచ్చేవి అని అంటున్నారు. అయితే ఇపుడు ఆ డౌట్లే నిజం అయ్యాయని అంటున్నారు. ఎందుకంటే బీజేపీలో అసలే మొత్తం 119 నియోజకవర్గాలకు సమర్ధులు అయిన అభ్యర్ధులు లేరు అని మాట ఉంది.

దానికి తోడు ఉన్న వారు కూడా కాంగ్రెస్ వైపుగా పరుగులు తీస్తూండడంతో కమలనాధులు ఖంగు తింటున్నారు. ఈ నేపధ్యంలో కమలం పార్టీలో కొత్త డౌట్లు కూడా పుట్టుకుని వస్తున్నాయట. ఒకవేళ పార్టీలో ఉన్న వారికి టికెట్లు ఇచ్చి బీ ఫారంలను చేతిలో పెట్టినా వారు పార్టీలో ఉంటారా అన్నదే ఆ డౌట్ అని అంటున్నారు.

బీ ఫారం తీసుకున్న వారు బీయారెస్ కో మరో పార్టీకో అమ్ముడు పోతారన్న భయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇపుడు బీజేపీలో దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అని అంటున్నారు. తాజాగా చూస్తే వీ 6 చానల్ యజమాని అయిన వివేక్ బీజేపీకి ఎంతో నమ్మకస్తుడు విశ్వాసపాత్రుడు అని నమ్మారు. ఆయనకు పార్టీ కూడా పదవులు ఇచ్చి గౌరవించింది.

అయితే ఆయన సడెన్ గా యూ టర్న్ తీసుకుని కాంగ్రెస్ కి జై కొట్టేసరికి బీజేపీకి ఏం చేయాలో అర్ధం కాలేదని అంటున్నారు ఇది పార్టీకి బిగ్ షాక్ గా కూడా చూస్తున్నారు అని అంటున్నారు. ఇక విజయశాంతి చాలా కాలంగా పెద్దగా సౌండ్ చేయడంలేదు, ఆమె పార్టీ పెద్దలకు దూరం పాటిస్తున్నారు. దాంతో ఆమె కూడా బీజేపీలో కొనసాగడం డౌట్ అనే అంటున్నారుట.

మరో వైపు చూస్తే మాజీ మంత్రి డీకే అరుణ, జితేందర్ లాంటి పెద్ద నాయకులు పోటీకి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకోవడం కూడా బీజేపీని కలవరపెడుతోంది. దాంతో తెలంగాణా బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా కూడా సాగుతోంది.

అందుకే ఉన్న వారు ఉంటున్నారు. బయటకు వెళ్ళిన వారు వెళ్తున్నారు మరికొందరు బయటకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇక పార్టీలో ఉన్న వారిలో కొందరు ఈ రోజుకు మౌనంగా ఉన్నా ఎన్నికల తరువాత తీర్పుని బట్టి జంప్ చేయాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. టోటల్ గా చూస్తే బీజేపీకి గత కొంతకాలంగా ఏమీ బాగా లేదు అనే అంటున్నారు.

అంతకు ముందు తెలంగాణాలో బీజేపీయే బీయారెస్ కి అసలైన ఆల్టర్నేషన్ అని అంతా అనుకున్నారు. ఆ పాలపొంగు చల్లారడంతో అసలు గుట్టు ఏంటో బయటపడింది అని అంటున్నారు. ఇపుడు కనుక లేటెస్ట్ పొజిషన్ చూస్తే తెలంగాణలో బీజేపీ రెండు నుంచి నాలుగు సీట్లు గెలిస్తే గొప్ప అన్నట్లుగా ఉందిట.

ఇలా కమలం పరిస్థితి ఉండడంతోనే చాలా మంది లీడర్స్ ముందు చూపుతో ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు అని అంటున్నారు. మొహమాటం వల్ల ఉన్న వారు కానీ లేక బయట పార్టీలలో తమకు ప్రస్తుతానికి చోటు లేదని ఆలోచిస్తున్న వారు కానీ బీజేపీలో ఉంటూ సైలెంట్ మెయింటెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఎన్నీకలు ముంచుకొస్తున్న వేళ బీజేపీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతోంది అని అంటున్నారు. అది కమలం పార్టీని తీవ్రంగా కలవరం పెడుతోంది.