Begin typing your search above and press return to search.

ఫ్లైట్ జర్నీ అయితే.. పట్టపగలే దోపిడీ.. ఎయిర్ పోర్టుల దారుణాలు

ఎయిర్ పోర్టులో ఫుడ్ తినాలనుకునే వారి నుంచి ఎంతలా దోచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన నెటిజన్ ఒకరు.. తన తాజా అనుభవాన్ని షేర్ చేస్తూ పోస్టు పెట్టారు

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:04 AM GMT
ఫ్లైట్ జర్నీ అయితే.. పట్టపగలే దోపిడీ.. ఎయిర్ పోర్టుల దారుణాలు
X

ఎంత ఫ్లైట్ జర్నీ అయితే మాత్రం మరీ ఇంత దోపిడీనా? అంటూ నెటిజన్ ఒకరు చేసిన పోస్టుకు భారీ స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు పలువురు ఇట్టే కనెక్టు అయిపోతున్నారు. తమకు జరిగిన అనుభవాల్ని సైతం పంచుకుంటున్నారు. ఎయిర్ పోర్టులో ఫుడ్ తినాలనుకునే వారి నుంచి ఎంతలా దోచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన నెటిజన్ ఒకరు.. తన తాజా అనుభవాన్ని షేర్ చేస్తూ పోస్టు పెట్టారు. దీనికి నెటిజన్లు ఇట్టే కనెక్టు అయిపోతున్నారు.

ఒకప్పుడైతే విమాన ప్రయాణాలు చాలా పరిమితంగా ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. సంపన్నులు.. సమాజంలోకి కొందరికి మాత్రమే పరిమితమైన విమాన ప్రయాణం ఇప్పుడు అవసరానికి అనుగుణంగా అందరూ వాడేస్తున్నారు. దీంతో.. ఎయిర్ పోర్టులు పలు సందర్భాల్లో రైల్వే స్టేషన్లను తలపిస్తున్నాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్టు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న రద్దీని తట్టుకోని ఎయిర్ పోర్టు వర్గాలు.. ప్రయాణికులతో వచ్చే వారిని రిక్వెస్టు చేస్తూ.. వీలైనంత తక్కువమంది ఎయిర్ పోర్టుకు రావాలని కోరుతున్న సంగతి తెలిసిందే.

ఏ ఎయిర్ పోర్టు అన్నది షేర్ చేసుకోలేదు కానీ.. సంజయ్ అరోరా అనే నెటిజన్ తాజాగా తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేవారు సాధారణ రాజ్మా చావల్ కోసం తాను రూ.500 పే చేశానని... ఇది పట్టపగలు దోపిడీలా ఉందని.. విమానాల్లో ప్రయాణిస్తున్నంత మాత్రాన జనాల నుంచి మరీ ఇలా డబ్బులు దోచేయాలా? అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. సంజయ్ ట్వీట్ కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఎయిర్ పోర్టుల్లో ఆహార ధరలపై పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. తాము కూడా ఇలానే చాలాసార్లు ఫీల్ అయినట్లుగా పేర్కొన్నారు. ఒక చిన్న కప్పు టీ కోసం రూ.300 చెల్లించాల్సి వచ్చిందంటూ మరో నెటిజన్ కామెంట్ల బాక్సులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎయిర్ పోర్టులో ఆహార ధరలు ఎక్కువగా ఉండటంపైన ఒకరు విశ్లేషిస్తూ.. ఎయిర్ పోర్టులను నిర్మించేందుకు చాలా ఖర్చు అవుతుందని.. దీనికి తోడు ఎయిర్ పోర్టుల్లో షాపుల అద్దెలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా భారీగా ధరలు పెట్టేస్తుంటారని పేర్కొన్నారు. అందరికి అన్ని ప్రయోజనాల్ని కల్పించే ప్రభుత్వాలు.. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వసూలు చేసే ధరల మీద కాస్తంత ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.