మోడీ పండగ చేసుకుంటే.. రాహుల వంట చేసుకున్నారు!
ప్రజలకు కూడా అయోధ్య పండుగ.. కొత్త సంవత్సరం పండుగలకు సంబంధించి.. మోడీ దిశానిర్దేశం కూడా చేశారు.
By: Tupaki Desk | 31 Dec 2023 7:47 PM GMTకొన్ని కొన్ని విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. రాజకీయంగా వాటిపై విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇక, నెటిజన్లు అయితే ఆడేసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా జరిగిన రెండు ఘటనలు ఆసక్తిగా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా దేశం మొత్తాన్ని రేడియోలో పలకరించారు. ఈ ఏడాది 2023కు చివరి ఆదివారం ఆయన మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. రేడియోలోనే అయోధ్య రామాలయ పండుగను నిర్వహించేసుకున్నారు.
ప్రజలకు కూడా అయోధ్య పండుగ.. కొత్త సంవత్సరం పండుగలకు సంబంధించి.. మోడీ దిశానిర్దేశం కూడా చేశారు. అంటే.. ఒక రకంగా మోడీ.. ఏడాది చివరి రోజు పొలిటికల్‌కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి దశ దిశ ఏర్పాటు చేసుకుంటూ పండగ చేసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు. సొనియా, రాహుల్ గాంధీలు(తల్లి కుమారులు) మాత్రం వంట గదిలో గంటల తరబడి కూర్చుకుని.. వంటలు చేసుకున్నారు.
కొత్త సంవత్సరం ఆరంభానికి గుర్తుగా తన తల్లి సోనియాతో కలిసి.. రాహుల్ గాంధీ రెండు గంటల పాటు.. వంట గదిలోనే గడిపాడు. ఈ సందర్భంగా ఇటలీ సంప్రదాయ వంటకం.. `ఆరెంజ్ మార్మలేడ్` జామ్‌ను ప్రిపేర్ చేశాడు. ఈ సందర్భంగా తల్లీ కుమారులు ఇద్దరూ కూడా పాత సంగతులు నెమరు వేసుకున్నారు. మొత్తానికి తమ తోటలోకి వెళ్లి పండ్లు కొసుకుని వచ్చిన దగ్గర నుంచివంటకం రెడీ చేసేవరకు.. దాదాపు 3 గంటల సమయం పట్టింది.
ఈ రెండు ఘటనలు.. అంటే అటు మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం.. ఇటు రాహుల్ వంట గదిలో గడపడం రెండూ ఒకే రోజు జరిగాయి. అది కూడా కీలకమైన ఎన్నికలకు ముందు జరగడంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మోడీ పండగ చేసుకుంటే. రాహుల్ వంట చేసుకున్నారని మెజారిటీ నెటిజన్లు అబిప్రాయ పడగా.. మరికొందరు రాహుల్ ఆత్మ విశ్వాసానికిప్రతీక అని.. వచ్చే ఎన్నికల్లో విజయం తమదనే ధీమాతో ఉన్నారని అనుకూలంగా స్పందించడం గమనార్హం.