అదే జరిగితే.. నాడు కేసీఆర్‌కు వచ్చిన కష్టమే రేవంత్‌కు కూడా!
అయితే.. ఇక్క అప్పటి నుంచి రేవంత్‌కు మరో కీలక కష్టం తెరమీదికి వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
By: Tupaki Desk | 2 Dec 2023 10:25 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్.. రేవంత్‌రెడ్డికి కొత్త కష్టం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ హవా పుంజుకుందని.. అధికారంలోకి వస్తుందని అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిజంగానే ముందస్తు ఎన్ని కల సర్వేలు నిజమైతే.. కాంగ్రెస్ పార్ట అధికారంలోకి రావడం ఖాయం. ఇదే జరిగితే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే.. దీనిని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.
ఒకవేళ అధిష్టానం కూడా రేవంత్‌కు జై కొడితే.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇక్క అప్పటి నుంచి రేవంత్‌కు మరో కీలక కష్టం తెరమీదికి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. గతంలో కేసీఆర్ .. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారనే వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్.. తనే సీఎం అయ్యారంటూ.. ఇటీవల ఎమ్మార్పీఎస్ కూడా ఆరోపించింది.
ఇది నిజానికి కేసీఆర్ పొలిటికల్ లైఫ్‌లో పెద్ద మచ్చగా మారిందనే చర్చ కూడా ఉంది. ఇక, ఇప్పుడు రేవంత్ విషయాన్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ కాకపోయినా.. తెలంగాణ ఎన్నికలకు ముందు ఆయన చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు తెరమీదికి వస్తోంది. కాంగ్రెస్ తరఫున సీతక్క ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు! అని రేవంత్ అప్పట్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సీతక్కకు తన మద్దతు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.
అయితే.. రేవంత్ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ.. కాంగ్రెస్ రేపు నిజంగానే అధికారం లోకి వస్తే.. ఈ మాటలే ఆయనకు ఎదురు తూటాలుగా మారడం ఖాయమని అంటున్నారు. గిరిజన సామా జిక వర్గానికి చెందిన సీతక్క ప్రస్తుతం ములుగు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు తథ్యమని అంచనాలు వస్తున్నాయి.
దీంతో రేవంత్ అంటే పడనివారు.. తమకు ఎలానూ సీఎం సీటు దక్కదని భావిస్తున్నవారు.. ఇప్పుడు రేవంత్ చేసిన గత డైలాగులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సీతక్క చుట్టూ సీఎం సీటును చుట్టేస్తున్నారు. దీంతో గతంలో కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందే.. ఇప్పుడు రేవంత్ ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.