ఇది రివర్స్ 'లవ్ ఎటాక్' తెలిస్తే.. నోరెళ్ల బెట్టడం ఖాయం!
అయితే.. ఏపీకి చెందిన ఓ విద్యార్థిని.. తెలంగాణలో చేసిన చిత్రమైన పని వెలుగు చూసింది.
By: Tupaki Desk | 23 Feb 2024 10:30 AM GMTతనను ప్రేమించడం లేదని.. యువతులపై దాడులు చేసేవారు ఉన్నారు. ఇక, తాను పాఠాలు చెప్పే విద్యా ర్థినులను ప్రేమ పేరుతో మోసం చేసే ప్రబుద్ధులైన ఉపాధ్యాయుల కేసులు కూడా తెలిసిందే. అంతేకాదు.. కొన్ని కొన్ని పాఠశాలలకు.. విద్యార్థినులను పంపించాలంటేనే హడలి పోయే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీనికి కారణం.. ఉపాధ్యాయుల ప్రవర్తనే కారణం. అయితే.. ఏపీకి చెందిన ఓ విద్యార్థిని.. తెలంగాణలో చేసిన చిత్రమైన పని వెలుగు చూసింది. ఇక్కడ రివర్స్ పద్ధతిలో లవ్ ఎటాక్ జరిగింది.
ఓ విద్యార్థిని తనకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపై మనసు పారేసుకుంది. ఈ విషయాన్ని ఆయన చెవిలో కూడా వేసింది. కానీ, ఆయన వారించారు. నీకు-నాకు ప్రేమేంటి? అని ప్రశ్నించారు. నువ్వు నా సోదరితో సమానం.. అలాంటి ఆలోచనలు లేకుండా.. బుద్ధిగా చదువుకుని జీవితంలో పైకి రా.. అని ప్రబోధించారు. కానీ, ప్రేమ పొరలు కమ్ముకుపోయిన.. ఆ విద్యార్థినికి.. మాస్టారు చెప్పిన మంచి మాటలు చెవికెక్కలేదు. ఏదో ఒకరకంగా.. ఆయనను తనవైపు తిప్పుకోవాలని భావించింది. ఈ క్రమంలో వేసిన మాస్టర్ ప్లాన్ వికటించింది.
ఏం జరిగింది?
తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి(24) గ్రూప్-1 శిక్షణ కోసంహైదరాబాద్‌కు వచ్చింది. అశోక్‌నగర్‌లోని ఓ శిక్షణ సంస్థలో చేరిన ఆమె, అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పడింది. తాను ప్రేమిస్తున్న విషయాన్ని అధ్యాపకుడికి చెప్పగా.. తనకు భార్యాపిల్లలున్నారని చెబుతూ మందలించారు. అంతేకాదు, నువ్వు చదువులో ఫస్ట్ ఉన్నావు.. మంచి ఉద్యోగం సంపాయించుకుని జీవితంలో పైకి రా.. అని బోధించారు.
కానీ, ఆయన మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. మాస్టారుపై ఏకంగా `ప్రేమ పగ` పెంచుకున్న యువతి అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అధ్యాపకుడి కుటుంబ చిత్రాలతోపాటు 11 ఏళ్ల ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేసింది. అధ్యాపకుడు పనిచేసే శిక్షణ సంస్థ, హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సప్ గ్రూపుల్లోనూ బూతులతో కూడిన పదజాలంతో పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తూ వచ్చింది.
దీంతో మాస్టారు ఒకటికి రెండు సార్లు చెప్పి చూశారు. కానీ, ఆమెలో మార్పు రాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నగర సైబర్‌క్రైమ్ బృందం విచారించింది. సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని అనంతపురంలో అరెస్టు చేసింది. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఇదీ.. సంగతి!!