ఇక్కడున్న బంగారాన్ని పంచితే అందరూ బిలియనీర్లే!
ఈ క్రమంలో తాజాగా బంగారంతో నిండిన ఒక గ్రహశకలాన్ని కనుగొంది. ఇప్పుడు ఆ గ్రహశకలాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది.
By: Tupaki Desk | 12 Oct 2023 3:30 PM GMTఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మహాద్భుతాలు, ఇంకెన్నో రహస్యాలు, ఎన్నెన్నో నిగూడ రహస్యాలు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని రహస్యాలపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిత్యం ఏదో ఒక రీసెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఈ సృష్టి ఆవిర్భావం, జీవం పుట్టుక, ఈ ప్రపంచం ఆవలి ప్రపంచం పై నిత్యం ఏదో ఒక పరిశోధన చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా బంగారంతో నిండిన ఒక గ్రహశకలాన్ని కనుగొంది. ఇప్పుడు ఆ గ్రహశకలాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది.
అవును... అంతర్జాతీయ అంతరిక్ష పరిశోదనా కేంద్రం(నాసా) తాజాగా అంగారక - బృహస్పతి గ్రహాల మధ్యనున్న "16 సైక్" అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా దీనికోసం ఉద్దేశించిన మిషన్ పై పని చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ లోహ గ్రహశకలంలో నిండా ఇనుము, నికెల్ తో పాటు భారీ ఎత్తున బంగారం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక అక్కడున ఆ ఖనిజాల విలువ లెక్కించడం సాధారణ కాలిక్యిలేటర్లకు ఆల్ మోస్ట్ అసాధ్యం. కారణం... ఆ గ్రహ శకలంపై ఉన్న ఖనిజాల విలువ 10,000 క్వాడ్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఒక్క ఒక క్వాడ్రిలియన్ అంటే... 1 తర్వాత 15 సున్నాలకు సమానమైన సంఖ్య (1,000,000,000,000,000)! దాన్ని బట్టి ఎవరి లెవెల్లో వారు అంచనా వేసుకోవచ్చన్నమాట!
సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు) వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం బంగాళాదుంప ఆకారంలో ఉంటుందని నాసా చెబుతుంది. భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు. అందుకే దీనికి 16 సైక్ అని నామకరణం చేశారు.
ఇక ఈ గ్రహశకలాన్ని ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న కనుగొన్నారు. దీంతో... ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది.. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది అని చెబుతుంటారు. ఈ గ్రహశకలంపై ఉన్న రెండు లోతైన ప్రాంతాల వల్ల... ఇది చేప ఆకారంలో కనిపిస్తుంటుంది!
ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. ఈ క్రమంలో... నాసా ఈ సైక్ స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ గ్రహశకలంపై లభించే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చట!