బర్త్ డే రోజే ఐఐటీ బాబా సుసైడ్ అటెంప్ట్..అసలేం జరిగింది?
హఠాత్తుగా ఐఐటీ బాబా సుసైడ్ అటెంప్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. అసలేం జరిగింది..ఐఐటీ బాబా ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో చూద్దాం..
By: Tupaki Desk | 4 March 2025 3:01 PM ISTఊరంతటిది ఓ దారైతే..ఉలిపికట్టెది ఓదారి అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అలాంటివాడే ఐఐటీ బాబా. ఈమధ్య వివాదాస్పద కామెంట్లు చేసి నెటిజన్ల చివాట్లు తిన్నాడు. తింటే తిన్నాడు కానీ దేశమంతా తెలిసిపోయాడు. కానీ అదే అతడికి శాపమైనట్టు ఉంది. హఠాత్తుగా ఐఐటీ బాబా సుసైడ్ అటెంప్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. అసలేం జరిగింది..ఐఐటీ బాబా ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారో చూద్దాం..
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా సందర్భంగా దేశవ్యాప్తంగా ఐఐటీ బాబా పేరు వైరల్ అయ్యింది. ఈయన అసలు పేరు అభయ్ సింగ్. ఐఐటీ బొంబే ఓల్డ్ స్టూడెంట్. ఏరోస్పేస్ ఇంజినీర్ గ్రాడ్యుయేట్. 2008 జేఈఈలో జాతీయ స్థాయిలో 731 వ ర్యాంకు సాధించిన ఉన్నత విద్యావంతుడు. ఏమైందో ఏమో గాని ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు.
రీసెంట్ గా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఇండియా ఓడిపోతుందని జోస్యం చెప్పి దేశ వ్యాప్తంగా విమర్శల పాలయ్యాడు. దేశమంతా శత్రువులను కొనితెచ్చుకున్నాడు. అతడిపై కొందరు కాషాయ వ్యక్తులు దాడికి కూడా ప్రయత్నించారని వాపోయాడు కూడా. తాజాగా ఈ ఐఐటీ బాబా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఓ హోటల్ లో ఐఐటీ బాబా సూసైడ్ అటెంప్ట్ చేశాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం పోలీసులకు తెలిసి అక్కడి వెళ్లారు. తీరా ఆ రోజే అతడి బర్త్ డే. పుట్టిన రోజు నాడే ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందని నెట్టింట చర్చకు కూడా దారితీసింది.
ఐఐటీ బాబా సుసైడ్ అటెంప్ట్ విషయం తెలిసిన పోలీసులు ఆ హోటల్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఐఐటీ బాబా పెద్ద షాకే ఇచ్చాడు. తాను గంజాయి సేవించినట్టు పోలీసులతో చెప్పాడు. గంజాయి తాగి మైకంలో ఉన్న అతని వాలకాన్ని చూసిన కొందరు ఆత్మహత్య యత్నం చేశాడమోనని పోలీసులకు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు.
ఐఐటీ బాబా వద్ద పోలీసులకు కొంత గంజాయి లభించింది. అయితే నార్కొటిక్ చట్టం ప్రకారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అది కొంత పరిమాణంలోనే ఉండటంతో ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు పోలీసులు. బెయిల్ విడుదల చేసినప్పటికీ అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సూచించారు. గంజాయి, ఆత్మహత్యా యత్నం విషయాలపై ఐఐటీ బాబాను మీడియా ప్రశ్నిస్తే.. నేడు తన బర్త్ డే అని తాను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఇలాంటి గంజాయి బ్యాచ్ గాళ్లను బాబాలు అని పిలువడమేంటోనని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఇలాంటి వారిని కటకటాల వెనక్కి పంపించాల్సిన అవసరముందని అంటున్నారు నెటిజన్లు.