కుర్చీలతో కొట్టుకున్నారు... (ఐఐటీ) స్టూడెంట్సా మజాకా?
సాధారణంగా ఐఐటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ అంటే చూసే సామాన్య ప్రజానికానికి ఒకరకమైన అభిప్రాయం ఉంటుందనేది తెలిసిన విషయమే
By: Tupaki Desk | 9 Oct 2023 8:28 AM GMTసాధారణంగా ఐఐటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ అంటే చూసే సామాన్య ప్రజానికానికి ఒకరకమైన అభిప్రాయం ఉంటుందనేది తెలిసిన విషయమే. అక్కడ చదువు కుంటున్నాడంటే... హైలీ టాలెంటెడ్ అయి ఉంటాడు, ఐఐటీలో సీటు రావడం అంటే అంత ఈజీ కాదని చెప్పుకుంటుంటారు. ఇదే సమయంలో అలాంటి చోట్ల చదువుకుంటున్నారంటే వారు చాలా సౌమ్యంగా ఉంటారు.. వారికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదని భావిస్తుంటుంటారు.
అయితే... అనుకున్నామని నిజం కాదు అన్నీ.. అనుకోలేదని అబద్దం కావు కొన్ని అన్నట్లుగా ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఐటీ స్టూడెంట్స్ కూడా సినిమాల్లో చూపించే, అప్పుడప్పుడూ బయట కనిపించే కాలేజీ కుర్రాళ్లే అని నిరూపితమయ్యే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ఐఐటీలో వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది.
అవును... ఐఐటీ కాన్పూర్ లో రెండు జట్ల మధ్య జరుగుతున్న కబడ్డీ మ్యాచ్ లో ఏదో ఒక విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా.. ఒకరిద్దరూ విద్యార్థూల్ మధ్య గొడవ కాస్తా రెండు గ్రూపుల తగాదాగా మారింది. దీంతో... రెండు గ్రూపుల సభ్యులు ఒకరినొకరు మీద పడి మరీ కొట్టుకున్నారు. అంతటితో ఆగలేదు ఆయుదాలుగా కుర్చీలను మలుచుకున్నారు.
ఈ గొడవలో కుర్చీలకు పని చెప్పారు రెండు వర్గ్లా మధ్య విద్యార్థులు. కుర్చీలిచ్చుకుని కొట్టుకుంటూ, కింద పడి తన్నుకుంటూ, పిడి గుద్దులు గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వర్ఘాలకు చెందిన విద్యార్థులకూ గాయలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
అయితే ఈ గొడవ ఈ స్థాయిలో జరగడానికి గల స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ... గొడవ మాత్రం కాస్త గట్టిగానే జరిగిందనే విషయం వీడియోలో స్పష్టమవుతోంది. దీంతో... ఈ ఘటన జరుగుతున్న సమయంలో మహిళా క్రీడాకారులు భయపడి బయటకి పారిపోతున్న దృశ్యాలు కూడా బయటకి వచ్చాయి.