అమెరికా టు భారత్... ఆ 104 మందిలో ఒకరు ఇంటర్ పోల్ వాంటెడ్!!
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులు 104 మందిని భారత్ కు పంపించిన వేళ.. వారిలో ఓ వ్యక్తి ఇంటర్ పోల్ నేరగాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 7 Feb 2025 12:03 PM ISTఅక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్.. వారందరినీ ఎవరి దేశానికి వారిని పంపించేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలివిడతలో భాగంగా.. 104 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా నుంచి సీ-17 విమానంలో భారత్ కు పంపించేశారు. వీరంతా బుధవారం అమృత్ సర్ కి చేరుకున్నారు.
దీంతో... ఎయిర్ పోర్ట్ లో దిగిన అనంతరం భారత్ అధికారులు ఈ అక్రమ వలసదరుల డాక్యుమెంట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమయంలో.. వారిలో ఎలాంటి నేర చరిత్ర లేనివారిని రెగ్యులర్ చెక్కింగ్స్ అనంతరం వారి వారి సొంత ప్రాంతాలకు పంపించేస్తున్నారు. వారితో ఎలాంటి సమస్యా లేదని అంటున్నారు.
అయితే... అమెరికా నుంచి అక్రమ వలసదారులజాబితాలో వచ్చినవారిలో కొంతమందిపై నేరారోపణలు ఉన్నాయని, కేసులు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని అంటున్నారు. వారిని మాత్రం తదుపరి చర్యల కోసం ఓ డిటెన్షన్ సెంటర్ కు తరలిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆ జాబితాలో ఇంటర్ పోల్ వాంటెడ్ ఒకరున్నారని అంటున్నారు.
అవును... అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులు 104 మందిని భారత్ కు పంపించిన వేళ.. వారిలో ఓ వ్యక్తి ఇంటర్ పోల్ నేరగాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి! ఈ వ్యవహారంపై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు.
ఆ ఇంటర్ పోల్ వాంటెడ్ క్రిమినల్ రికార్డులను పరిశీలించగా.. అతడిపై ఇటలీలో కేసు నమోదైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో.. సదరు వలసదరుడిపై తదుపరి చర్యలు ఎలా ఉండాలి అనే అంశాన్ని దర్యాప్తు అధికారులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం అసక్తిగా మారింది.