Begin typing your search above and press return to search.

హిందుత్వ అనే వ్యాధి.. చెలరేగిన ఇల్తీజా!

కశ్మీర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి కం పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె కావటమే దీనికి కారణం.

By:  Tupaki Desk   |   9 Dec 2024 7:08 AM GMT
హిందుత్వ అనే వ్యాధి.. చెలరేగిన ఇల్తీజా!
X

సమస్యను సమస్యగా.. ఇష్యూను ఇష్యూగా చూడటం మానేసి చాలా కాలమే అయ్యింది. బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వారు నోరు పారేసుకోవటం.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. ఒకరు తప్పు చేసిన దానికి మొత్తం ఆ వర్గం మీదా.. వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు ఇల్తీజా.

ఈమె ఎవరు? ఆమె మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అని అనుకోవచ్చు. కానీ.. ఇక్కడే అసలు విషయం ఉంది. ఎందుకంటే ఆమె సాదాసీదా మహిళ కాదు. కశ్మీర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి కం పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె కావటమే దీనికి కారణం. ఒక వీడియోలో ముస్లిం కుర్రాడ్ని కొడుతున్న వీడియోను పోస్టు చేసిన ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఎవరో.. ఎక్కడో ఏదో చేశారన్న కారణాన్ని చూపుతూ.. కోట్లాది మంది మనసులు గాయపరిచేలా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.

ఇంతకూ ఇల్తీజా ఏమన్నారు? అన్నది చూస్తే.. హిందుత్వ ఒక వ్యాధి అని.. అది హిందూవాదాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు.. వేధింపులు.. హత్యలకు హిందుత్వ కారణంగా మండిపడ్డారు. రామ నామాన్ని జపించటానికి ఒప్పుకోని ఒక ముస్లిం బాలుడ్ని చెప్పులతో కొడుతున్న వీడియోను ఆమె ఎక్స్ లో షేర్ చేవారు. ‘‘ఘోరం జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు.

ఒక మతాన్ని అనురించే వారు తప్పు చేసినప్పుడు.. సదరు వ్యక్తిని చట్టపరమైన చర్యల కోసం డిమాండ్ చేయాలే తప్పించి.. సదరు మతాన్ని అనుసరించే దేవుడ్ని లాగటంలో అర్థం లేదనే చెప్పాలి. అలాంటి పనినే చేసిన ఇల్తీజా తీరును తప్పు పట్టాల్సిందే. ఎవరో ఏదో చేశారంటూ హిందువులకు అరాధ్యనీయమైన దైవాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం సరికాదు. హిందుత్వ.. హిందూయిజం మధ్య వ్యత్యాసం ఉందన్న ఆమె.. హిందుయిజం మాత్రం ఇస్లాం తరహాలో లౌకికవాదాన్ని.. సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు.

హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉంటుందన్నారు. జై శ్రీరాం అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదన్న ఆయన.. మూకదాడుల సమయంలో ఈ నినాదాన్ని వాడుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఇల్తీజా వ్యాఖ్యలపై జమ్ముకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం తప్పు లేదన్న ఆయన.. ఇతరుల మతపరమైన మనోభావాల్ని గాయపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. నిజమే కదా?