అమెరికన్స్ పై ట్రంప్ ప్రభావం పీక్స్... ఈ ఘణాంకాలు చూస్తే చాలు!
ఇందులో భాగంగా... ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు అమెరికన్స్ షాపింగ్ చేసే విధానానికి.. ఇప్పటి విధానాన్నికి చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.
By: Tupaki Desk | 18 March 2025 9:04 AM ISTఅధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ అమెరికన్స్ లైఫ్ స్టైల్ లో చాలా మార్పులే వస్తున్నాయని.. ట్రంప్ ప్రభావం అమెరికన్స్ పై బలంగానే పనిచేస్తున్నట్లుందని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా... ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు అమెరికన్స్ షాపింగ్ చేసే విధానానికి.. ఇప్పటి విధానాన్నికి చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.
అవును... షాపింగ్ చేసే విషయంలో అమెరికన్స్ స్టైల్ పూర్తిగా మారిపోతోందని.. అందుకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అని చెబుతున్నారు. ప్రధానంగా టారిఫ్ ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో.. దానికి ప్రతిగా ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు ప్రకటించడమే దీనికి కారణం అని అంటున్నారు.
ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.. ఫలితంగా.. రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుందనే విషయంపై అందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గృహోపకరణాలు, ఇతరాత్ర షాపింగ్ కోసం అమెరికన్లు ఆచితూచి ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
ఉదాహరణకు... ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జనవరిలో రిటైల్ సేల్స్ 1.2 శాతం పడిపోగా.. ఫిబ్రవరిలో స్వల్పంగా పుంజుకుని 0.2 శాతం పెరిగాయి. ఇక నిత్యవసర సరుకులు, గృహోపకరణ, అన్ లైన్ రిటైలర్ అమ్మకాలు పెరగ్గా... రెస్టారెంట్లు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ స్టోర్లలో విక్రయాలు, వస్త్ర దుకాణాలు అమ్మకాలు పడిపోయాయి.
ఈ విషయాన్ని కామర్స్ డిపార్ట్ మెంట్ గణాంకాలు వెల్లడించాయి. కొనుగోళ్ల విషయంలో స్వల్ప పెరుగుదల చూస్తుంటే.. ఖర్చు విషయంలో అమెరికన్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.