Begin typing your search above and press return to search.

లక్షన్నర ఉద్యోగాలకు కోత పెట్టిన పాక్

దీనికి.. ముందు వెనుకా ఆలోచించకుండా ఓకే చెప్పేసిన పాకిస్థాన్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:27 AM GMT
లక్షన్నర ఉద్యోగాలకు కోత పెట్టిన పాక్
X

దేశమే కావొచ్చు. ఆర్థికంగా బలహీనపడి.. బండి నడిపేందుకు భారీ ఎత్తున నిధులు అవసరమైనప్పుడు.. ఎవరో ఒకరి ముందుకెళ్లి చేతులు చాచాల్సిందే. ఆ టైంలో అప్పిచ్చేటోడి నుంచి ఏ మాట అయితే వస్తుందో.. ఆ మాటను ఇట్టే ఫాలో కావాలి. లేకుంటే.. వాడి వద్ద నుంచి అప్పు పుట్టదు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పాటు దివాళా అంచుకు పాక్ ఆర్థిక పరిస్థితి చేరుకున్న వేళ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్దకు నిధుల కోసం వెళ్లిన పాకిస్థాన్ కు.. దిమ్మ తిరిగే రూల్ పెట్టి.. అలా చేస్తే మాత్రమే తాము ఆర్థిక సాయాన్ని చేస్తామని తేల్చేసింది.

దీనికి.. ముందు వెనుకా ఆలోచించకుండా ఓకే చెప్పేసిన పాకిస్థాన్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఖర్చులు తగ్గించుకోవటంలో భాగంగా దేశ వ్యాప్తంగా లక్షన్నర ఉద్యోగాలకు కోత పెట్టాలన్న మాటకు కట్టుబడి ఉండేందుకు పాక్ ఓకే చెప్పింది. తాజాగా 7 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిన షరతులకు తలూపిన పాక్.. పాలనాపరమైన వ్యయాల్ని తగ్గించుకోవటానికి దేశ వ్యాప్తంగా ప్రభుత్వంలోని లక్షన్నర ఉద్యోగాలకు కోత పెట్టనున్న విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆరు మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికి.. మరో రెండంటిని విలీనం చేయనున్నట్లు పేర్కొంది.

తాజా నిర్ణయంపై పాక్ ప్రజల స్పందన ఏమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. గత ఏడాది దివాలకు చేరువైన వేళ.. ఐఎంఎఫ్ ద్వారా బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కిన వైనం తెలిసిందే. అయినప్పటికి ప్రభుత్వం తీరు.. ప్రజల ఆలోచనల్లో మార్పు రాలేదు. దీంతో.. వారి పరిస్థితి మెరుగుపడ లేదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్ తో కొంతకాలంగా సుదీర్ఘ చర్చలు జరిపింది

పాక్ ప్రయత్నాలు ఫలించి.. సహాయ ప్యాకేజీ విషయంలో ఐఎంఎఫ్ ఓకే చెప్పింది. అయితే.. ఇందుకు కొన్ని కండిషన్లు పెట్టింది. ఖర్చులు తగ్గించుకోవటం.. పన్ను -జీడీపీ నిష్ఫత్తిని పెంచటం లాంటి వాటితోపాటు.. వ్యవసాయం.. రియల్ ఎస్టేట్ రంగాలపై పన్ను పెంచి.. రాయితీలుతగ్గించటం లాంటివాటికి పాక్ సర్కారు ఓకే చెప్పటంతో.. తామిచ్చే ఆర్థిక సాయానికి సంబంధించి మొదటి విడతగా ఒక బిలియన్ డాలర్లను విడుదల చేసింది.

జీ20 కూటమిలో చేరేందుకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందని.. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఆరు మంత్రిత్వ శాఖల్ని మూసేస్తున్నట్లుగా పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబు ప్రకటించారు. వివిధ మంత్రిత్వ శాఖల్లోని 1.50లక్షల పోస్టులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. దేశంలో పన్నుచెల్లింపుదారుల సంఖ్యను 16 లక్షల నుంచి 32 లక్షలకు పెంచినట్లుగా వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు కొసమెరుపు మాటేమంటే.. ఇకపై పాకిస్థాన్ లో పన్నులు చెల్లించని వారు ఆస్తులు.. వాహనాల్ని కొనుగోలు చేయలేరని చెప్పిన వైనం సంచలనంగా మారింది. దీనికి పాక్ ప్రజలు ఎలా రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న.