Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఖాన్ విడుదల యూకే బిలియనీర్ కోరిక... ఎక్స్ వైఫ్ హాట్ కామెంట్స్!

ఇందులో... జైల్లో అతనిని కలవడానికి అనుమతి నిరాకరించడంపై ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:35 AM GMT
ఇమ్రాన్ ఖాన్ విడుదల యూకే బిలియనీర్  కోరిక... ఎక్స్  వైఫ్  హాట్  కామెంట్స్!
X

వివిధ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఆ దేశ 22వ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్ఫాస్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అతని విడుదలను కోరుకుంటూ యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఓ బిలియనీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... జైలులో ఉన్న మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్ఫాస్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని బ్రిటీష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్.. పాకిస్థాన్ అధికారులను కోరారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టిన రిచర్డ్ బ్రాన్సన్... ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్థాన్ అధికారులు వెంటనే విడుదల చేయాలని కోరారు.

అతని ఏకపక్ష నిర్భంధం పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై ఉన్న గౌరవంపై చీకటి నీడను చూపుతుందని అన్నారు. వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడైన బ్రాన్సన్... ఈ ట్వీట్ తో పాటు ఇమ్రాన్ ఖాన్ తో ఉన్న పాత ఫోటోను జతచేసారు. ఆ ఫోటోలో సూట్ ధరించి ఖాన్ ఉండగా.. పక్కన బ్రాన్సన్ కూర్చుని ఉన్నాడు.

ఈ పోస్ట్ లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు గురించి వచ్చిన మీడియా కథనాన్ని కూడా హైలెట్ చేశారు. ఇందులో... జైల్లో అతనిని కలవడానికి అనుమతి నిరాకరించడంపై ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు పొందుపరిచారు!

ఈ సందర్భంగా స్పందించిన జెమీమా... పాకిస్థాన్ లో రాజకీయ వ్యతిరేకతను సైలంట్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఖాన్ ఓ ఏడాది పాటు రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారని.. అతనిపై అనేక కేసులు ఉన్నాయని చెప్పిన ఆమె... భద్రతా కారణాలను చూపుతూ అతనిని కలవడాన్ని ప్రభుత్వం నిషేదించిందని తెలిపారు.

ఇదే సమయంలో... కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ లోని రాజకీయ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులతొ సహా పలూ వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించిన గోల్డ్ స్మిత్.. పీటీఐ ప్రత్యర్థి ఐన పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీ.ఎం.ఎల్.-ఎన్) సభ్యులు తనపై దాడులకు నాయకత్వం వహించారని ఆమె ఆరోపించారు.

వీటితో పాటు.. లండన్ లో ఉంటున్న అతని కుమారులకు ఫోన్ కాల్స్ తో సహా అతని కుటుంబంతో ఖాన్ కు ఉన్న సంబంధాలను కూడా పాక్ అధికారులు కట్ చేశారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం జైల్లో ఖాన్ ను విద్యుత్ లేని గదిలో నిర్భందించారని.. బయట ప్రపంచానికి ప్రవేశం లేకుండా చేశారని ఆమె ఆరోపించారు.