ఏపీకి ఆదాయ మార్గాలు ఐదు కొత్త పాలసీలు: చంద్రబాబు
ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఐదు కొత్త పాలసీలు తీసుకువస్తున్నట్టు తెలిపారు.
By: Tupaki Desk | 1 Aug 2024 12:30 AM GMTఏపీలో ఆదాయా మార్గాలు ఏర్పాటు చేసే దిశగా ఐదు కొత్త పాలసీలు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా పలు శాఖలపై ఆయన సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఐదు కొత్త పాలసీలు తీసుకువస్తున్నట్టు తెలిపారు.
1) నూతన ఇండస్ట్రీయల్ పాలసీ
2) ఎంఎస్ఎంఈ పాలసీ
3) ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
4) ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ
5) టెక్స్ టైల్ పాలసీ
ఈ ఐదు పాలసీలను 100 రోజుల్లో అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. వీటి ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడి, పన్నులు, రాష్ట్ర సర్కారుకు ఆదాయం పెంచుతామని చెప్పారు. అదేవిధంగా కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ ఏర్పాటు చేసేలా.. 4 ఇండస్ట్రియల్ క్లష్టర్లకు సంబంధించిన నూతన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపుతున్నట్టు తెలిపారు.
గతంలో చేసుకున్న ఒప్పందాలను కూడా సమీక్షించి.. వాటిని తిరిగి గాడిలో పెట్టాలని కూడా నిర్ణయించా మన్నారు. 2014-19 మధ్య రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి చంద్రబాబు.. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకువచ్చే అంశంపై దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. వీటి వల్ల ఉద్యోగాలు, ఉపాధి పెరుగుతుందని.. ఏటా నాలుగు లక్షల మందికి ఉపాధి , ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.