అక్కడ రెండు రోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు !
అక్కడ 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో 500 రూపాయల నోట్ల కట్టల్లో లభ్యమయ్యాయి.
By: Tupaki Desk | 21 May 2024 5:28 AM GMTఉత్తర్ ప్రదేశ్ లోని చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ అధికారుల దాడులలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో 500 రూపాయల నోట్ల కట్టల్లో లభ్యమయ్యాయి. అయితే వాటిని లెక్కించటానికి మెషీన్లు కూడా మొరాయిస్తున్నాయి.
ఆగ్రాలోని ఎమ్జీ రోడ్‌కు చెందిన బీకే షూస్, ధాక్రాన్‌కు చెందిన మన్షు ఫుట్‌వేర్, ఆసఫోటిడా మండికి చెందిన హర్మిలాప్ ట్రేడర్స్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లు తదితర 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. వ్యాపారుల ఇళ్లల్లో డబ్బుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హర్మిలాప్ ట్రేడర్స్ యజమాని రామ్‌నాథ్ డంగ్‌కు చెందిన జయపురలోని ఇంట్లో మంచాలు, పరుపులు, అల్మారాలు, షూ బాక్స్‌లు, బ్యాగులు, గోడల్లో భారీ మొత్తంలో రూ.500ల నోట్ల కట్టలను ఐటీ బృందం గుర్తించింది. రెండు రోజుల క్రితం సోదాలు ప్రారంభమవ్వగా, ఇప్పటికీ ఈ నగదును లెక్కిస్తూనే ఉన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో
మంచంపై రూ. 500 నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి.
గోవింద్ నగర్‌లోని రామ్‌నాథ్డాంగ్కు చెందిన మరో నివాసంలో కూడా భారీగా నగదు పట్టుబడింది. ప్రత్యేక బృందాలు, డబ్బుల లెక్కింపులో నిమగ్నమై ఉన్నాయి. వాషింగ్ మెషీన్, గోడల్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా డబ్బులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో చెప్పుల వ్యాపారి రామ్‌నాథ్‌డాంగ్ ఇంటి నుంచి ఐటీ బృందం ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. కొంతకాలంగా బీకే షూస్, మన్షు ఫుట్‌వేర్‌లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో ఐటీ శాఖ సోదాలు చేసింది.