గణనీయంగా పెరిగిన విమానయానం.. ఒక్క ఏడాదిలో అన్ని కోట్ల మంది ప్రయాణించారా..!
దేశంలో విమానయానం చేస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. గడిచిన ఏడాది భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాల్లో ప్రయాణాలు సాగించారు.
By: Tupaki Desk | 23 Jan 2025 1:30 PM GMTదేశంలో విమానయానం చేస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. గడిచిన ఏడాది భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాల్లో ప్రయాణాలు సాగించారు. 2024లో 16.13 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఏటా గణాంకాలను పరిశీలిస్తే ఇది 6 శాతం పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది.
విమాన ప్రయాణికులు అధికం కావడం వేగంగా విస్తరిస్తున్న ఏవిఎస్ఎన్ మార్కెట్ ను ప్రతిబింబిస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన కొన్నాళ్ళుగా దేశంలో విమానయానం చేస్తున్న ప్రయాణికులు సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన ఏడాది డిసెంబర్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.49 కోట్లకు చేరుకుంది. ఇది 2023 డిసెంబర్ తో పోలిస్తే 8.19 శాతం ఎక్కువ. ఇండిగో 64.4 శాతం వాటాతో మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, ఎయిర్ ఇండియా 26.4 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ వరుసుగా 4.6 శాతం, 3.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండిగో అత్యధికంగా 73.4% ఆల్ టైం పర్ఫార్మెన్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్ ఇండియా 67.6 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
విమానాల రద్దు, జాప్యం కారణంగా డిసెంబర్లో మొత్తం ఓటిపి దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే విమానాల రద్దు రేటు 1.07 శాతంగా ఉంది. విమానాల వద్ద వల్ల 67,622 మంది ప్రయాణికులపై ప్రభావం చూపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రద్దులకు పరిహారం, సౌకర్యాల కోసం విమానయాన సంస్థలు రూ.1.26 కోట్లు ఖర్చు చేశాయి. విమానాలు ఆలస్యం వల్ల 2,79,985 మంది ప్రయాణికులు పై ప్రభావం పడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. విమానయాన సంస్థలు విమానాలు ఆలస్యం వల్ల ఇబ్బందులు పడిన ప్రయాణికులు సౌకర్యాల కోసం రూ.3.78 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. 2,147 మంది ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించారు. ఇందుకోసం విమానయాన సంస్థలు 1.76 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
కరోనా వైరస్ ప్రభావం నుంచి విమానయాన రంగం క్రమంగా కోరుకుంటుంది. కరోనా వల్ల 2021 నుంచి 2023 మధ్యకాలంలో విమానయాన రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే ఈ రంగం కోరుకుంటుంది. పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమాన సంఖ్యలు, నెట్వర్కులను విస్తరిస్తున్నాయి. విమాన ప్రయాణ డిమాండ్ ను పెంచడంలో భారత ఆర్థిక అభివృద్ధి కూడా కీలకపాత్ర పోషించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత విమానయాన రంగం మరింత వృద్ధి చెందుతుందని చెబుతున్నారు.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఈ రంగం ఒకటనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరగడం అభివృద్ధికి చిహ్నంగాను భావించాల్సి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో విమానయానం చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. విమాన సేవలు అందుబాటులోకి రావడం, టికెట్టు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి కారణాలు కూడా విమానయానం చేసే వారి సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోంది.