Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీని అభినందించిన చైనా... ఎందుకో తెలుసా?

భారత్ కు పాకిస్థాన్ కు మధ్య బహిరంగ శతృత్వం ఉంటే.. భారత్ కు చైనాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుందని చెబుతారు.

By:  Tupaki Desk   |   18 March 2025 8:00 AM IST
ప్రధాని మోడీని అభినందించిన చైనా... ఎందుకో తెలుసా?
X

భారత్ కు పాకిస్థాన్ కు మధ్య బహిరంగ శతృత్వం ఉంటే.. భారత్ కు చైనాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుందని చెబుతారు. ఈ విషయంలో ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్రీడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించింది. ఈ సందర్భంగా మోడీని అభినందించింది.

అవును... అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో భారత్ - చైనా సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత్ - చైనాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు మోడీ తెలిపారు. దీనిపై తాజాగా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందించారు.

ఇందులో భాగంగా... గత ఏడాది అక్టోబర్ లో రష్యాలోని కజాన్ లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ల భేటీ.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటంతో పాటు వ్యూహాత్మక మార్గదర్శకత్వానికి దోహదం చేసిందని అన్నారు. ఇదే సమయంలో.. శతాబ్ధాల చర్చల చరిత్రలో రెండు దేశాలు స్నేహపూర్వక సంప్రదింపులు కొనసాగించాయని తెలిపారు.

ప్రధానంగా... ఇరు దేశాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ మనవ నాగరికత, పురోగతికి కృషి చేశాయని.. అభివృద్ధి చెందుతున్న రెండు అతిపెద్ద దేశాలుగా ఈ ఇరు దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయని మావో నింగ్ పేర్కొన్నారు. భారత్ తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఆమె మరోసారి వెల్లడించారు.

కాగా.... ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోడీతో మాట్లాడుతూ.. భారత్ - చైనాల మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం చర్చలకే మొగ్గు చూపుతానని పేర్కొన్నారు. ప్రధానంగా వాస్తవాధీన రేఖ వెంబడి 2020 ముందునాటి పరిస్థితులను నెలకొల్పేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.