Begin typing your search above and press return to search.

మానస సరోవర్ యాత్రకు చైనా ఓకే.. ఎందుకిలా?

చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వెయ్ డాంగ్ తో భేటీ అయిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు.. కీలక నిర్ణయాలు ఓకే కావటం గమనార్హం.

By:  Tupaki Desk   |   28 Jan 2025 9:30 AM GMT
మానస సరోవర్ యాత్రకు చైనా ఓకే.. ఎందుకిలా?
X

డాగ్రన్ దేశం ఎప్పుడు ఎలా రియాక్టు అవుతుందో చెప్పలేం. అంచనాలకు భిన్నంగా స్పందించే గుణం ఆ దేశానికి ఎక్కువే. తాజాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ కు వెళ్లిన విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్త్రీ.. పలు ఒప్పందాలు జరగటమే కాదు.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల దిశగా అడుగులు పడటం ఆసక్తికరంగా మారింది. చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వెయ్ డాంగ్ తో భేటీ అయిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు.. కీలక నిర్ణయాలు ఓకే కావటం గమనార్హం.

అన్నింటికి మించి నాలుగేళ్ల క్రితం మానస సరోవర్ యాత్రకు.. చైనాకు నేరుగా విమాన సర్వీసులు రద్దు కాగా.. వాటిని తాజా భేటీలో పునరుద్దరించేలా నిర్ణయం జరిగింది. దీంతో ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర్ యాత్ర పున: ప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. అంతేకాదు.. అంతర్జాతీయ నదుల విషయమై పరస్పరం మరింతగా సహకరించుకునేందుకు జల వనరులకు సంబంధిత డేటాను పూర్తి స్థాయిలో ఇచ్చి పుచ్చుకోవటానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల నిపుణుల సథాయి టీం దీనిపై వీలైనంత త్వరగా చర్చలు జరపనుంది. గత అక్టోబరులో కజాన్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ..చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ తో భేటీ సందర్భంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే తాజా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇరు దేశాల దౌత్య బంధానికి 75 ఏళ్లు పూర్తి అవుతున్నాయని.. ఈ సందర్భంగా విశ్వాస కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది.

ఆర్థిక..వర్తక రంగాల్లో ఇరు దేశాల్లో నెలకొన్న పరస్పర ఆందోళనలు.. సందేహాలకు సమాధానం పలికేలా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ముందుకు సాగాలన్న అంగీకారం కుదిరినట్లుగా పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఒప్పందాలు రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరెంత పెరుగుతాయన్నది కాలమే బదులివ్వాలి.