Begin typing your search above and press return to search.

విద్యారంగం అభివృద్ధిపై నీతి ఆయోగ్ ఆసక్తికర నివేదిక!

మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేశంలో విద్యా వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

By:  Tupaki Desk   |   17 Feb 2025 10:30 AM GMT
విద్యారంగం అభివృద్ధిపై నీతి ఆయోగ్ ఆసక్తికర నివేదిక!
X

దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో (జీఈఆర్) 0.4 శాతంగా ఉండగా.. అది 2021-22 నాటికి ఏకంగా 71 రెట్లు పెరిగి 28.4 శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక.. క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ ర్యాంకింగ్స్ తో దీన్ని పోల్చుకుంటే.. భారతీయ విద్యా వ్యవస్థ 318 శాతం పెరుగుదలను నమోదు చేసిందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

అవును... మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేశంలో విద్యా వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానంగా పదేళ్ల ఎన్డీయే హయాంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని.. అందువల్ల గ్రామ స్థాయి నుంచి దేశ రాజధాని వరకూ ఈ పురోగతి సాధ్యమైనట్లు తెలిపింది. ఈ మేరకు ఘణాంకాలు విడుదల చేసింది.

ఇలా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ తో దీన్ని పోల్చుకుంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం 318 శాతం పెరుగుదలను నమోదు చేసిందని.. ఇది జీ-20 దేశాల్లోనే అత్యధిక వృద్ధి, పురోగతి అని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలోని యూనివర్శిటీలు నాణ్యమైన విద్యను అందించడంపై నీతి ఆయోగ్ ఈనెలలో ఓ నివేదిక విడుదల చేసింది.

ఈ నివేదికలో స్టేట్ పబ్లిక్ యూనివర్శిటీలు (ఎస్.పీ.యూ) సుమారు 3.25 కోట్ల మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించింది.

వాస్తవానికి 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారని.. అప్పట్లో యూనివర్శిటీల్లో విద్యార్థుల హాజరు నమోదు కేవలం 14 శాతం ఉండటంతో ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేదని నీతి ఆయోగ్ తెలిపింది.

అయితే... నాటి నుంచి నేటి వరకూ ప్రభుత్వాల చర్యల కారణంగా భారతదేశ విద్యారంగం చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని.. ఇందులో భాగంగా ప్రస్తుతం విద్యార్థుల హాజరు నమోదు 81 శాతానికి పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.