భారతదేశపు తొలి ట్రిలియనీర్ ఎవరో తెలుసా?
ట్రిలియనీర్లు అయ్యే అవకాశం ఉన్న టాప్-10 వ్యక్తులు
By: Tupaki Desk | 8 Sep 2024 7:30 PM GMTఒకప్పుడు మిలియనీర్ అనిపించుకుంటే గొప్ప. ఇప్పుడు మిలియనీర్లు కోకొల్లలు. ఇటీవల బిలియనీర్ అనడం సులువుగా మారింది. మునుముందు ట్రిలియనీర్‌లను చూడబోతున్నాం. ఇది నిజంగా సంచలనమే. అసలు ఈ ప్రపంచం మొట్ట మొదటి బిలియనీర్ ని చూసింది ఎప్పుడు? అంటే.. 1916లో.
29 సెప్టెంబరు 1916న అప్పటి వార్తాపత్రికలు ఎప్పటికీ సాధ్యం కాదని భావించిన సంపద మైలురాయిని ప్రకటించాయి. ప్రపంచంలోని మొట్టమొదటి బిలియనీర్ గురించి పత్రికలు కథనాలు రాసాయి. $2,014 వద్ద ఉన్న స్టాండర్డ్ (చమురు) దాని యజమానిని బిలియనీర్‌గా చేసింది! అని ది న్యూయార్క్ టైమ్స్ హెడ్‌లైన్ సంచలనం సృష్టించింది. స్టాండర్డ్ ఆయిల్ పెరుగుతున్న షేర్ ధర జాన్ D. రాక్‌ఫెల్లర్ అనే వ్యవస్థాపకుడు, అతిపెద్ద వాటాదారుని దాదాపుగా బిలియనీర్‌గా చేసింది. మొదటి U.S. బిలియనీర్ (కొలవదగిన డాలర్ పరంగా) అతడు. ఆ తర్వాత ఒక శతాబ్దానికి పైగా ట్రిలియనీర్ మార్క్‌ను ఎవరు చేరుకుంటారనే ప్రశ్న ఆసక్తికరంగా కొనసాగుతూనే ఉంది. కనీసం అరడజను కంపెనీలకు ఇది సాధ్యం. ఇటీవల బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ.. ఇది వారెన్ బఫ్ఫెట్ 94వ పుట్టినరోజుకు ముందు 1 ట్రిలియన్ డాలర్ కి చేరుకుంది. ఎన్విడియా ఇప్పుడు 2.6 ట్రిలియన్ డాలర్ వద్ద ఉంది. గత సంవత్సరం ఇది 13-ఫిగర్ క్లబ్‌ను తాకిందని ప్రఖ్యాత CNBC తన కథనంలో పేర్కొంది.
పైవివరాలు ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో కంపెనీలు. అలా కాకుండా వ్యక్తుల పేర్లు చేరతాయా? అంటే.. ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడెమీ వివరాల ప్రకారం.. సంపదలో సగటు వార్షిక వృద్ధి రేటు ఆధారంగా ట్రిలియనీర్ స్థితిని అంచనా వేస్తే.. టెస్లా CEO ఎలాన్ మస్క్ మొదటి ట్రిలియనీర్ కావచ్చు అని చెబుతోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ ప్రస్తుతం 251 బిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కనెక్ట్ అకాడెమీ అంచనా మేరకు మస్క్ 2027లో ట్రిలియనీర్ అవుతాడు. అతడి సంపద వార్షిక సగటు రేటు 110 శాతం పెరుగుతూనే ఉంది. అకాడెమీ అంచనా ప్రకారం.. ట్రిలియనీర్ హోదాను చేరుకునే రెండవ వ్యక్తి అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ. అదానీ తన ఇటీవలి వార్షిక వృద్ధి రేటు 123 శాతం కొనసాగిస్తే, అతడు 2028లో ట్రిలియనీర్ అవుతాడని ఈ నివేదిక చెబుతోంది.
ఎన్‌విడియా CEO అయిన జెన్సన్ హువాంగ్, తన సంపద ఐదు సంవత్సరాలలో 3 బిలియన్ల డాలర్ల నుండి 90 బిలియన్ల డాలర్లకు పైగా వచ్చి ఆకాశాన్ని తాకింది. అతని సంపద సగటు వార్షిక రేటు 112 శాతం వృద్ధిని కొనసాగించాలి. ఎన్‌విడియా స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 115 శాతం పెరిగింది. గత సంవత్సరం మూడు రెట్లు ఎక్కువ. ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పాంగేస్టు, ఇండోనేషియా ఎనర్జీ అండ్ మైనింగ్ సమ్మేళనం బారిటో పసిఫిక్ వ్యవస్థాపకుడు ఉన్నాడు. 2028 నాటికి పాంగేస్టు ట్రిలియనీర్ హోదాకు చేరుకోవచ్చనది నివేదిక అంచనా. మొదటి ఐదు స్థానాలలో LVMH CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి. కేవలం 200 బిలియన్ల డాలర్లకు కొంత తక్కువ. మెటాతో పాటు లగ్జరీ కింగ్ 2030లో ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
టాప్ 10 క్లబ్‌ను త్వరగా చేరుకోవడానికి బలమైన అభ్యర్థులుగా కనిపిస్తున్న కొంతమంది అగ్రశ్రేణి బిలియనీర్లు టాప్ 10లో చేరలేరని అంచనా. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 200 బిలియన్ల డాలర్లతో 12వ స్థానంలో ఉంటారు. 2036 వరకు ట్రిలియనీర్ కాలేడు. లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ గూగుల్ వ్యవస్థాపకులు ట్రిలియనీర్లు కావడానికి 12 సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంది. అయినప్పటికీ కృత్రిమ మేధస్సు వారి ఎదుగుదలను వేగవంతం చేయవచ్చు.
సంపదల ఎదుగుదలను చూస్తున్నవారు కొన్నేళ్లుగా మొదటి ట్రిలియనీర్ ఎవరు అనేది అంచనా వేస్తున్నారు. టెస్లా, ఎన్విడియా, ఎల్‌విఎంహెచ్ స్టాక్‌లు గత ఐదేళ్లలో పెరిగినంత వేగంగా వచ్చే ఐదేళ్లలో పెరగకపోవచ్చు.
అయితే మొదటి బిలియనీర్ పుట్టుకొచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు పైగా మొదటి ట్రిలియనీర్ వచ్చే దశాబ్దంలో పట్టాభిషిక్తుడు కావొచ్చని అంచనా వేస్తున్నట్టు సీఎన్‌బిసి తన కథనంలో పేర్కొంది.
ట్రిలియనీర్లు అయ్యే అవకాశం ఉన్న టాప్-10 వ్యక్తులు
10. స్టీవ్ బాల్మెర్ 2034
9. మైఖేల్ డెల్ 2033
8. ముఖేష్ అంబానీ 2033
7. ఫిల్ నైట్ 2030
6. మార్క్ జుకర్‌బర్గ్ 2030
5. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 2030
4. ప్రజోగో పాంగేస్తు 2028
3. జెన్సన్ హువాంగ్ 2028
2. గౌతమ్ అదానీ 2028
1. ఎలన్ మస్క్ 2027