Begin typing your search above and press return to search.

అమెరికాకు వెళ్లే టూరిస్టుల్లో మనది సెకండ్ ప్లేస్

అమెరికాలో పర్యాటక రంగం ప్రోతసాహకం కోసం పని చేస్తున్న బ్రాండ్ లలో యూఎస్ఏ సంస్థ ఒకటి.

By:  Tupaki Desk   |   23 Jan 2025 5:30 AM GMT
అమెరికాకు వెళ్లే టూరిస్టుల్లో మనది సెకండ్ ప్లేస్
X

అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే.. ఈ దేశానికి వెళ్లే టూరిస్టుల్లో అత్యధికులు భారతీయులు రెండో స్థానంలో ఉన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు యూఎస్ఏ సీఈవో ఫ్రిడ్ డిక్సన్. 2023లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు పర్యాటకుల కారణంగా రూ.1.72 లక్షల కోట్లు సమకూర్చినట్లుగా పేర్కొన్నారు. అమెరికాలో పర్యాటక రంగం ప్రోతసాహకం కోసం పని చేస్తున్న బ్రాండ్ లలో యూఎస్ఏ సంస్థ ఒకటి.

అమెరికాకు వచ్చే భారతీయ పర్యాటకుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2024లో ఇది రెండో స్థానానికి చేరుకున్నట్లుగా చెప్పారు. మొదటి స్థానంలో యూకే ఉండగా.. జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. భారత్ రెండో స్థానానికి చేరుకుంది. 2024 ఒక్క ఏడాదిలో భారతీయులు రికార్డు స్థాయిలో 22 లక్షల మంది అమెరికాలో పర్యటించారు. ఈ వ్రద్ధి రేటు 2023తో పోలిస్తే 24 శాతం.. 2019తో పోలిస్తే 50 శాతం ఉండటం విశేషం.

అంతేకాదు.. 2024లో భారతీయులకు రికార్డు స్థాయిలో పర్యాటక వీసాలు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలోని వారిలో 50 లక్షల మందికి అమెరికా పర్యాటక వీసాలు ఉన్నాయని.. 2026లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ పోటీల్ని వీక్షించేందుకు ఫుట్ బాల్ అభిమానులు భారీగా అమెరికాకు రానున్నట్లు చెప్పారు. ఏమైనా.. అమెరికా మీద క్రేజ్ భారతీయులకు అంతకంతకూ ఎంత ఎక్కువ అవుతున్నది ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.