Begin typing your search above and press return to search.

ప్రపంచంలో సంతోషకరమైన దేశాలివే... భారత్ స్థానం దారుణం!!

ఆనందంగా జీవించడం అనే సామూహిక కొలతను నిర్వచించడం చాలా కష్టం అనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   8 Oct 2024 3:44 AM GMT
ప్రపంచంలో సంతోషకరమైన దేశాలివే... భారత్  స్థానం దారుణం!!
X

ఆనందంగా జీవించడం అనే సామూహిక కొలతను నిర్వచించడం చాలా కష్టం అనే చెప్పాలి. ఒక్కొక్కరి దృష్టిలో సంతోషంగా బ్రతకడాన్ని ఒక్కోరకంగా నిర్వచిస్తుంటారు. ఇందులో ప్రధానంగా ఆర్థిక అవకాశం, విద్య అనేవి కచ్చితంగా ప్రజల శ్రేయస్సును పెంపొందించగలవు. ఈ సమయంలో రే డాలియో గ్రేట్ పవర్స్ ఇండెక్స్ - 2024 నుంచి ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల వివరాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఈ ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు ఏమిటనే విషయాన్ని తాజాగా రే డాలియో పరిశీలించింది. ఈ సందర్భంగా ఓ మెథడాలజీని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగా సంతృప్తికర జీవితం, రోజువారీ ఆనందంలో నివేదించిన జనాభా వాట, మంచి సోషల్ నెట్ వర్క్ మద్దతు, ప్రతీ లక్ష మందికి ఆత్మహత్య రేటును ప్రమాణికంగా తీసుకుంది.

ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) మొదటి స్థానంలో ఉంది. 2024లో 143 దేశాలలో యూకే 20 స్థానంలో ఉన్నట్లు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తో ఈ తాజా నివేదిక విభేదించినప్పటికీ... పాత తరాలలో ఈ ర్యాంకింగ్ అధిక స్థాయి సంతోషాన్ని కలిగి ఉందని అంటున్నారు. ఐరాసతో పాటు ఇతర గ్లోబల్ ఇండెక్స్ లు అదే విధంగా సూచిస్తున్నాయి.

ఇక ఈ జాబితాలో ఇండోనేషియా రెండో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో 79% పౌరులు తాము చాలా సంతోషంగా ఉన్నట్లు వెళ్లడించారు. ఇక ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా 10 స్థానంలో నిలిచింది. దీంతో... ఆర్థిక బలం ఎల్లప్పుడూ ఆనందంతో సంబంధం కలిగి ఉండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో సుమారు గత రెండు దశాబ్ధాలుగా అమెరికాలో యువతరంలో స్వీయ నివేదికత ఆనందం తగ్గుతోందని చెబుతున్నారు. ఇక ఫైనల్ గా ఈ జాబితాలో భారతదేశం చివరి స్థానంలో ఉండటం గమనార్హం. ఆదాయ అసమానత, పరిమిత సామాజిక మొబిలిటీ, సంస్థలపై విస్తృతమైన అపనమ్మకం దీనికి కారణం అని అంటున్నారు.

ఈ క్రమంలో... ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో సంతోషకరమైన టాప్ 10 దేశాల జాబితా ఈ విధంగా ఉంది...!

యునైటెడ్ కింగ్ డమ్

ఇండోనేషియా

నెథర్లాండ్స్

మెక్సికో

స్విట్జర్లాండ్

ఆస్ట్రేలియా

కెనడా

చైనా

బ్రెజిల్

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా