Begin typing your search above and press return to search.

17 బ్యాంకులు, 7000 కోట్ల ఎఫ్.డీలు... మాధాపర్ విలేజ్ గురించి తెలుసా?

అవును... ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలోనే ఉందనే విషయం తెలుసా?

By:  Tupaki Desk   |   9 Sep 2024 12:30 AM GMT
17 బ్యాంకులు, 7000 కోట్ల ఎఫ్.డీలు... మాధాపర్  విలేజ్  గురించి తెలుసా?
X

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా చెప్పుకోబోయే ఓ గ్రామం గురించి వింటే మాత్రం ఇది పట్టుకొమ్మ కాదు.. బంగారు కొమ్మ డైమండ్ కొమ్మ, ప్లాటినం కొమ్మ అని మార్చి కూడా అనుకోవచ్చు అని చెప్పినా అతిశయోక్తి కాదు! ఎందుకంటే... ఇది ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం. ఇది భారత్ లోనే ఉంది.

అవును... ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలోనే ఉందనే విషయం తెలుసా? భారతదేశంలోని ప్రముఖ వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటైన గుజరాత్ రాష్ట్రంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు మాధాపర్. ఈ గ్రామాన్ని మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా పిలుస్తారు. అందుకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి.

ఈ గ్రామంలో ఉన్న బ్యాంకులు, వాటిలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లు అంతా ఇంతా కాదు. ఈ గ్రామ జనాభా 60వేల వరకూ ఉంటారని అంచనా! ఇక వారిలో మెజారిటీ ప్రజానికం పటేల్ కమ్యునిటీకి చెందినవారు ఉంటారు. ఈ గ్రామంలో ఎస్.బీ.ఐ, హెచ్.డి.ఎఫ్.సి., పీ.ఎన్.బీ., ఐసీఐసీఐ, యూనియన్, యాక్సిస్ మొదలైన 17 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి.

ఇలా ఓ గ్రామంలో 17 బ్యాంకులు ఉండటం అన్నది కచ్చితంగా అసాధారణమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ బ్యాంకులన్నింటిలో కలిపి సుమారు రూ.7000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నయనేది అసలు షాకింగ్ విషయంగా చెబుతుంటారు. ఇక ఈ గ్రామంలో చాలా మంది విదేశాల్లో ఉండటం.. అక్కడ నుంచి గ్రామాలకు డబ్బు పంపిస్తుండటం చేస్తుంటారు.

ప్రధానంగా సెంట్రల్ ఆఫిక్రాలోని నిర్మాణ వ్యాపారాల్లో గుజరాతీలు అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అంటుంటారు. ఇదే సమయంలో... ఈ ప్రాంతానికి చెందినవారు యూఎస్, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ లోనూ పలు వ్యాపారాల్లో ఉన్నారని అంటుంటారు. ఈ రకంగా అక్కడున్నవారంతా తమ తమ డబ్బును గ్రామానికే పంపించి సేవ్ చేస్తుంటారు.

ఇక్కడ ఈ విధంగా బ్యాంకుల్లో వేల కోట్ల డబ్బు మూలుగుతున్నప్పటికీ గ్రామాభివృద్ధి విషయంలో మాత్రం పెద్దగా ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉందని చెబుతుంటారు.. నర్మాదా నది నీరు ఈ గ్రామానికి రావాల్సిన స్థాయిలో, కావాల్సిన స్థాయిలో రాదని అంటుంటారు. ఫలితంగా మంచి నీటి సమస్య ఉందని వాపోతుంటారు.