Begin typing your search above and press return to search.

పవర్ ఫుల్ మ్యాన్ నరేంద్ర మోడీ.. సర్వేలో సంచలన విషయాలు

మోడీ తర్వాత రాజకీయంగా అత్యంత శక్తిమంతుడైన రెండో వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ నిలవడం గమనార్హం.

By:  Tupaki Desk   |   13 Nov 2024 8:14 AM GMT
పవర్ ఫుల్ మ్యాన్ నరేంద్ర మోడీ.. సర్వేలో సంచలన విషయాలు
X

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ఘనత చాటుకున్నారు. రాజకీయంగా అత్యంత శక్తిమంత నాయకుడిగా మరోసారి మోడీ టాప్ ర్యాంక్ సాధించారు. ఇండియా టుడే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడిచింది. మోడీ తర్వాత రాజకీయంగా అత్యంత శక్తిమంతుడైన రెండో వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ నిలవడం గమనార్హం.

ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం మరోసారి ర్యాంకులను రిలీజ్ చేసింది. అందులో మోడీ, మోహన్ భగవత్ టాప్ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆ తరువాతి స్థానాల్లో హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్లుగా నివేదికలో వెల్లడించింది. వారి తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కడం విశేషం. దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల జాబితాలో చంద్రబాబు ఐదో స్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఇక ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది.

ముఖ్యంగా ఇండియా టుడే 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. గత లోక్‌సభ ఎన్నికలతో మోడీ హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోసారి తిరుగులేని నాయకుడిగా ఫలితం సాధించారు. మరోసారి ప్రధాని అయ్యారు. స్వాతంత్ర్య భారతంలో 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఏకకాలంలో అమెరికా.. మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేలతోనూ స్నేహసంబంధాలు సాగిస్తున్నారు. వీటికితోడు భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు. అందుకే ఆయన ఈ ఘనత సాధించారని నివేదికలో పేర్కొంది.

వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తీసుకురావడంలో సక్సెస్ అయిన నేత రాహుల్‌గాంధీ అని గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి.. జైలుకెళ్లినా.. 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలా ఎగిసి చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టారు. ఎన్డీయేలో టీడీపీని రెండో అతి పెద్ద పార్టీగా నిలిపారు. అందుకే ఆయన ముఖ్యమంత్రుల్లో టాప్ ప్లేసులో నిలిచినట్లు పేర్కొంది. చంద్రబాబు తరువాత బిహార్ సీఎం నితీష్‌కుమార్, యూపీ సీఎం ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరులు ఉన్నారు.