Begin typing your search above and press return to search.

మోడీ బహుకరించిన కిరీటం చోరీ.. బంగ్లాకు భారత్ విజ్ఞప్తి!

దీనిపై అక్కడున్న పలు హిందూ సంఘాలు ఇటీవల తీవ్ర ఆందోళనలు కూడా.

By:  Tupaki Desk   |   11 Oct 2024 8:20 AM GMT
మోడీ బహుకరించిన కిరీటం చోరీ.. బంగ్లాకు భారత్  విజ్ఞప్తి!
X

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మొన్న తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న బంగ్లాదేశ్ లో ఓ పక్క హిందువులకు పలు ఇబ్బందుకు కలిగిస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై అక్కడున్న పలు హిందూ సంఘాలు ఇటీవల తీవ్ర ఆందోళనలు కూడా.

ఇదే సమయంలో దుర్గామాత విగ్రహాలు నెలకొల్పుకోవడానికి డబ్బులు కట్టాలంటూ స్థానిక అసాంఘిక శక్తులనుంచి అల్టిమేటాలు జారీ అవుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2021లో జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోడీ బహుకరించిన కిరీటం చోరీకి గురైంది.

అవును... బంగ్లాదేశ్ లోని కాళీమాత ఆలయానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుకరించిన కిరీటం చోరీకి గురైంది. దీంతో... బాంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ సంఘటన చెబుతుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ లోని భారత హైకమిషన్ స్పందించింది.

ఈ సందర్భంగా స్పందించిన బంగ్లాదేశ్ లోని భారత హైకమిషన్... 2021లో బంగ్లాదేశ్ లో పర్యటించిన సమయంలో జేశోరేశ్వరీ కాళీమాత ఆలయానికి ప్రధాని నరేంద్రమోడీ బహుకరించిన కిరీటం చోరీకి గురైందనే వార్తలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపీంది. ఈ విషయం తాము తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో... ఈ ఘటనపై సత్వరం విచారణ జరిపించి కిరీటం స్వాధీనం చేసుకోవాలని.. దొంగలను శిక్షించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు అక్కడున్న భారత దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. నిందితులను వెంటనే శిక్షించాలని కోరింది. అయితే.. ఈ విజ్ఞప్తిపై బంగ్లాదేశ్ నుంచి ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది!

కాగా... బంగ్లాదేశ్ లోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్ లోని ఈ జేశోరేశ్వరీ కాళీమాత ఆలయం 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఈ క్రమంలో... ఆ దేశ పర్యటనలో భాగంగా... 2021లో మోడీ బంగారం పూత పూసిన వెండి కిరీటాన్ని సమర్పించారు. ఇప్పుడు ఆ కిరీటం చోరికి గురైంది. దీన్ని వెంటనే పట్టుకోవాలంటూ బంగ్లాకు భారత్ విజ్ఞప్తి చేసింది.