డబ్బున్న రాష్ట్రాలు : టాప్ టెన్ లో ఏపీ ప్లేస్ ఎక్కడ ?
దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో డబ్బు బాగా ఉన్న రాష్ట్రాలు అంటే ఏవి అన్నది చాలా మంది ఆసక్తిగా చూస్తారు.
By: Tupaki Desk | 18 Nov 2024 5:19 PM GMTదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో డబ్బు బాగా ఉన్న రాష్ట్రాలు అంటే ఏవి అన్నది చాలా మంది ఆసక్తిగా చూస్తారు. అయితే దేశానికి ఆర్ధిక రాజధానిగా పేరున్న ముంబై ఉన్న మహారాష్ట్ర దేశంలోనే డబ్బున్న రాష్ట్రంగా తొలి స్థానం దక్కించుకుంటుందని కూడా కామన్ సెన్స్ ఉన్న వారికి అర్ధం అయ్యే విషయమే.
దీని మీద ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి ఇటీవల తెలియచేసిన వివరాలను చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ని జీఎస్ డీపీ అని పిలుస్తారు. దానిని ప్రమాణంగా తీసుకుంటే టాప్ వన్ లో మహారాష్ట్ర ఉంది.
మహారాష్ట్ర జీఎస్ డీపీలో 42.67 లక్షల కోట్ల రూపాయలతో దూసుకుని పోతోంది. ఆ తరువాత ప్లేస్ తీసుకుంటే తమిళనాడు ఉంది. ఆ రాష్ట్రం 31.55 లక్షల కోట్ల రూపాయతో పరుగులు పెడుతోంది. ఇక మూడవ ప్లేస్ లో కర్ణాటక స్టేట్ ఉంది. ఆ రాష్ట్రం 28.09 లక్షల కోట్ల రూపాయలతో ఉంది.
ఇక గుజరాత్ రాష్ట్రం 7.90 లక్షల కోట్ల రూపాయలతో నాలుగో ప్లేస్ లో ఉంటే ఉత్తరప్రదేశ్ 24.99 లక్షల కోట్ల రూపాయలతో అయిదవ ప్లేస్ లో ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ 18.8 లక్షల కోట్ల రూపాయలతో ఆరవ ప్లేస్ లో ఉంది. రాజస్థాన్ 17.8 లక్షల కోట్ల తో ఏడవ ప్లేస్ లో ఉంది. తెలంగాణ 16.5 లక్షల కోట్ల తో ఎనిమిదవ ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 15.89 లక్షల కోట్ల తో తొమ్మిదవ ప్లేస్ లో ఉంది. మధ్యప్రదేశ్ 15.22 లక్షల కోట్ల తో పదవ ప్లేస్ లో ఉంది.
ఇక జీఎస్ డీపీ ఎలా వస్తుంది అంటే ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు అదే విధంగా అక్కడ ఉన్న వివిధ రంగాలలో కనిపించే ప్రగతి, వాటి ద్వారా లభించే ఉత్పత్తి ఇవన్నీ కూడా కొలమానంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలకు భౌగోళిక పరిస్థితులు ఆటోమేటిక్ గా అనుకూలిస్తాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు ప్రణాళికాబద్ధంగా సాధించే విధానాల వల్ల కూడా ప్రగతి సాధ్యపడుతుంది. దాంతో అవి డబ్బున్న రాష్ట్రాలుగా కాలక్రమంలో మారుతాయి. ఈ మొత్తం జాబితా చూస్తే ఏపీ తొమ్మిదవ ప్లేస్ లో ఉంది.
నిజంగా ఇది ఆశించిన నంబర్ కాదు కానీ ఇపుడున్న నేపధ్యం నుంచి చూసినపుడు టాప్ టెన్ లో ఏపీ చోటు సంపాదించడం గ్రేట్ అనే అంటున్నారు. ఏపీలో పారిశ్రామిక రంగం సేవా రంగం ఇతర రంగాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాబట్టి రానున్న కాలంలో ఏపీలో జీఎస్ డీపీ పెరిగి ఏపీ నంబర్ కూడా టాప్ టెన్ లో ముందుకు ఎగబాకే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
ఇక చూస్తే కనుక దేశంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ అయినా రెండూ మూడూ కూడా సౌత్ స్టేట్స్ అయిన తమిళనాడు కర్ణాటక ఉండడం విశేషంగానే చెప్పాల్సి ఉంది. రానున్న రోజులలో ఏపీ తెలంగాణా కూడా పోటె పడితే టాప్ ఫైవ్ లోకి వెళ్లే చాన్స్ ఉందని అంటున్నారు.