దట్ ఈజ్... ట్రంప్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన భారత్!
అవును... డొనాల్డ్ ట్రంప్ భారత్ కు ఆఫర్ ఇవ్వగా.. అందుకు న్యూఢిల్లీ సున్నితంగా తిరస్కరించిన విషయం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 14 Feb 2025 7:34 PM GMTఅమెరికా పర్యటనలో భాగంగా... భారత ప్రధాని నరేంద్ర మోడీ, అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానంగా వాణిజ్యం, ఏఐ, రక్షణ మొదలైన విషయాలపై చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ ఓ ఆఫర్ ఇవ్వగా.. దాన్ని భారత్ సున్నితంగా తిరస్కరించిన విషయం తెరపైకి వచ్చింది.
అవును... డొనాల్డ్ ట్రంప్ భారత్ కు ఆఫర్ ఇవ్వగా.. అందుకు న్యూఢిల్లీ సున్నితంగా తిరస్కరించిన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... భారత్ - చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న ఘర్షణల నివారణకు సాయం చేస్తానంటూ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. మోడీ-ట్రంప్ సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా ముందుగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్... భారత్ సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.. ఫ్యూచర్ లోనూ అవి కొనసాగుతాయని అనుకుంటున్నాను.. ఈ సమయంలో తాను సాయం చేయగలను అని అంటే అందుకు సిద్ధంగా ఉన్నాను.. సుదీర్ఘకాలంగా హింసాత్మకంగా ఉన్న అవి ఆగాలి అని అన్నారు.
వాస్తవానికి.. భారత్ తో పొరుగుదేశాలతో ఉన్న ఘర్షణల విషయంలో మధ్యవర్తిత్వం ఆఫర్ డొనాల్డ్ ట్రంప్ నుంచి రావడం ఇదే తొలిసారి కాదు. తొలిసారి ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా చైనా, పాకిస్థాన్ తో ఉన్న వివాదాల విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనలే చేశారు. దీంతో.. నాడు ఆ ఆఫర్ ను భారత్ సున్నితంగా తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారిగా భారత ప్రధానితో జరిగిన భేటీలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇదే తరహా ఆఫర్ చేశారు. దీనిపై భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిశ్రి స్పందించారు. ఇందులో భాగంగా... పొరుగు దేశాలతో ఉన్న సమస్యలపై భారత్ ఎప్పుడూ ద్వైపాక్షిక చర్చలనే మార్గంగా ఎంచుకొంటుందని పేర్కొన్నారు.
దీంతో... ఈ విషయం వైరల్ గా మారగా... దట్ ఈజ్ భారత్, మా పర్సనల్ విషయాల్లో అగ్రరాజ్యం మద్దతు అవసరం లేదు కానీ.. సుంకాలతో ఇబ్బంది పెట్టకుండా స్నేహం కొనసాగిస్తే చాలు అన్నట్లుగా పలువురు స్పందిస్తున్నారు!