Begin typing your search above and press return to search.

అమెరికాలో చైనాను మించిన భారత్ హవా... తాజా రిపోర్ట్!

అవును... అమెరికాలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయంలో భారత్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటి వరకూ టాప్ ప్లేస్ లో ఉన్న చైనాను వెనక్కి నెట్టింది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 3:54 AM GMT
అమెరికాలో చైనాను మించిన భారత్  హవా... తాజా రిపోర్ట్!
X

అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా చైనా దేశం నుంచి ఉండేవారు! అయితే... అది గతం... ఇప్పుడు ఆ విషయంలో చైనాను భారత్ వెనక్కి నెట్టిందని, ఇప్పుడు అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని అమెరికాకు చెందిన ఓ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆసక్తికర గణాంకాలు తెరపైకి వచ్చాయి.

అవును... అమెరికాలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయంలో భారత్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటి వరకూ టాప్ ప్లేస్ లో ఉన్న చైనాను వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం (2023-24) లో అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 గా ఉండగా.. 3.30 లక్షల మందితో భారత్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ - 2024ను భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తాజాగా ఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉండగా.. వారిలో 29 శాతం మంది భారతీయులే అని తెలిపింది.

ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎకనమిక్ ఇంపాక్ట్ - 2023 ప్రకారం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో గత ఏడాది భారతీయ విద్యార్థుల సహకారం $11.8 బిలియన్లని అంటున్నారు. ఇక తాజా నివేదిక ప్రకారం... అమెరికాలో భారతీయ విద్యార్థులు 42.9% మ్యాథ్స్/కంప్యూటర్ సైన్స్ , 24.5% ఇంజినీరింగ్, 11.2% బిజినెస్/మేనేజ్ మెంట్, 5.4% ఫిజికల్/లైఫ్ సైన్స్ చదువుతున్నారు.

ఇక.. అమెరికా వెళ్లే గ్రాడ్యుయేట్ల సంఖ్య గతంతో పోలిస్తే 19 శాతం పెరిగి 1,96,567కు చేరగా.. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13 శాతం పెరిగి.. 36,053కి చేరిందని నివేదిక వెల్లడించింది. మరోపక్క అమెరికా నుంచి భారత్ తిరిగి వస్తున్న వారి సంఖ్యా పెరుగుతోందని.. వీరి సంఖ్య గత ఏడాది 336 కాగా.. ఈసారి వారి సంఖ్య 1,355 అని వెల్లడించింది.

అమెరికాలో అత్యధిక విద్యార్థులున్న టాప్ - 5 దేశాలు:

భారత్ - 3,31,602

చైనా - 2,77,398

దక్షిణ కొరియా - 43,149

కెనడా - 28,998

తైవాన్ - 23,157