ఏపీ వైపు ఇండియా కూటమి చూపు ....?
కానీ ఇపుడు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఇండియా కూటమి ఈ వైపు ఆసక్తిగా చూస్తోంది.
By: Tupaki Desk | 11 Sep 2023 5:08 PM GMTఇండియా కూటమికి సౌత్ లో బాగానే బలం ఉంది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో కూటమిలో ప్రధాన పార్టీ అయిన డీఎంకే అధికారంలో ఉంది. కేరణలలో కామ్రేడ్స్ పవర్ లో ఉన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఇపుడు లోటు అంతా ఏపీ లోనే ఉంది.
ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల రాజకీయ నడుస్తోంది. కాంగ్రెస్ 2014 ఎన్నికల నుంచి చితికిపోయింది. డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. 2024లో కూడా కాంగ్రెస్ ఎత్తిగిల్లే సీన్ అయితే లేదు. కాకపోతే అప్పటి కంటే ఇపుడు ఎంతో కొంత కాంగ్రెస్ మీద జనాలకు కోపం తగ్గింది అన్న భావన ఉంది.
దాంతో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు గెలిచి ఏపీలో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ఆశపడడంలో తప్పులేదు. అదే విధంగా ఏపీలో పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో కొన్ని ఎంపీ సీట్లు కూటమి పేరిట దక్కితే రేపటి రోజున రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఆ సీటు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏపీలో కూడా అధికారంలోకి వచ్చే పార్టీలో భాగస్వామ్యం కూడవచ్చు. ఇలా చాలా ఆలోచనలు ఇండియా కూటమిలో కాంగ్రెస్ కి ఉన్నాయి.
అయితే ఏపీలోని పార్టీలు అన్నీ కూడా బీజేపీ వైపు చూస్తున్న నేపధ్యం ఉంది. అందుకే మూడు మీటింగ్స్ ఇండియా కూటమివి జరిగినా ఏపీ నుంచి ఎవరికీ ఆహ్వానాలు రాలేదు. కానీ ఇపుడు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఇండియా కూటమి ఈ వైపు ఆసక్తిగా చూస్తోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈ టైం లో సైలెంట్ గా ఉండడంతో మెల్లగా ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నేతలు పెదవి విప్పుతున్నారు.
మమతా బెనర్జీ అయితే చంద్రబాబు అరెస్ట్ ని తప్పుపట్టారు. అదే విధంగా తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా బీజేపీ జగన్ని కలిపి మరీ విమర్శలు చేస్తున్నారు. బాబు అరెస్ట్ తప్పు అని అంటున్నారు. బీజేపీలోని పెద్దలను జగన్ ఏపీలో అనుసరిస్తున్నారు అని కూడా ముడిపెట్టి మరీ బాబుకు ఎన్డీయే కూటమికి దూరం పెంచేలా చూస్తున్నారు.
ఎటూ కామ్రేడ్స్ ఉండనే ఉన్నారు. వారి అయితే బీజేపీని నమ్మవద్దు అని అంటున్నారు ఇక ఏపీలో బంద్ జరిగితే టీడీపీకి జనసేన కామ్రేడ్స్ మద్దతు ఇచ్చారు. దాంతో ఇండియా కూటమి చాయలు ఏపీలో కనిపిస్తున్నాయి. ఎక్కడైతే బీజేపీ ఉండదో ఆ పార్టీ నీడ పడదో అక్కడ ఇండియా కూటమిని చాన్స్ దొరికినట్లే. ఇపుడు ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇవ్వకుండా దూరంగా బీజేపీ ఉన్న చోట ఇండియా కూటమి ఆశలు వెల్లివిరుస్తున్నాయి.
ఇక ఏపీలోని చాలా మంది సీనియర్ నేతలు ఏ పార్టీకి చెందని నాయకులు కూడా బీజేపీని వీడాలసిందే చంద్రబాబు అంటుననరు. మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వారు కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూనే ఇదంతా కాంగ్రెస్ చేయించింది అని అంటున్నారు. ఇలా చాలా రకాలుగా చర్చ సాగుతోంది. మరో వైపు రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో లోకేష్ ని ఇదే విషయం మీద ప్రశ్న వేసినపుడు ఆయన కేంద్రం దీని వెనక ఉందో లేదో తనకు తెలియదు అంటూనే మాకు మమతా బెనర్జీ లాంటి వారు మద్దతు ఇచ్చారని చెప్పుకున్నారు. అంటే ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ మద్దతు అని ముందుకు తెచ్చారు అంటే ఏపీలో ఏమి జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది.
ఇదంతా ఇపుడు తెమిలేది కాదు, రేపటి రోజున చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చిన నాడు కచ్చితంగా ఏపీ రాజకీయాలు వేరే మలుపు తీసుకునే అవకాశాలు ఉంటాయా అన్న సందేహాలు వస్తున్నాయి. రాజకీయ చాణక్యుడు చంద్రబాబు కచ్చితంగా కీలక అడుగులు వేస్తే అది తమకు కచ్చితంగా వరం అవుతుందని ఇండియా కూటమి తలపోస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ వైపు ఇండియా కూటమి చూపు పడింది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.