Begin typing your search above and press return to search.

దీపావ‌ళి వేళ‌.. చైనాను దెబ్బేసేసిన భార‌త్‌.. ఎన్నివేల కోట్లంటే!

ఈ క్ర‌మంలోనే ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని ప్రోత్స‌హిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో భార‌త్‌లో త‌యారీ రంగం పుంజుకుంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 10:30 AM GMT
దీపావ‌ళి వేళ‌.. చైనాను దెబ్బేసేసిన భార‌త్‌.. ఎన్నివేల కోట్లంటే!
X

"భార‌త్‌లో ఎటు చూసినా.. ఏ సందులో తిరిగినా చైనా ఉత్ప‌త్తులే క‌నిపిస్తున్నాయి. చిన్న పిల్లల బొమ్మ‌ల నుంచి ఇళ్ల‌లో వినియోగించే హొం నీడ్స్ వ‌ర‌కు.. చివ‌ర‌కు చేతిలోని హ్యాండ్‌సెట్ దాకా అన్నీ చైనా ఉత్ప‌త్తులే"- ఇదీ కొన్నాళ్లుగా వినిపించిన మాట‌. అయితే.. డ్రాగ‌న్ కంట్రీతో నెల‌కొన్ని విభేదాలు, గాల్వానా లోయ‌లో దూకుడు వంటి కార‌ణాల‌తో చైనాకు కీల‌క ఆర్థిక మార్కెట్‌గా ఉన్న భార‌త్‌ను దూరం చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. దీంతో స్వ‌దేశీ వ‌స్తు త‌యారీని ప్రోత్స‌హించింది.

ఈ క్ర‌మంలోనే ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని ప్రోత్స‌హిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో భార‌త్‌లో త‌యారీ రంగం పుంజుకుంది. బొమ్మ‌ల నుంచి ఇత‌ర హొం నీడ్స్ వ‌ర‌కు అనేక వ‌స్తువులు భార‌త్‌లోనే త‌యార‌వుతున్నాయి. ఇక‌, ప్ర‌తి పండుగ‌కు ప్ర‌త్యేకంగా చైనా నుంచి దిగుమ‌తి అయ్యే స‌రుకులు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా దీపావ‌ళి ట‌పాసులు చైనా నుంచి 80 శాతం మేర‌కు మ‌నం నిన్న మొన్న‌టి వ‌ర‌కు దిగుమ‌తి చేసుకునేవాళ్లం.

కానీ, గ‌త రెండేళ్లుగా దేశంలోనే ట‌పాసుల త‌యారీ కేంద్రాల సంఖ్య‌ను కేంద్రం పెంచింది. ఫ‌లితంగా స్వ‌దేశీ ట‌పాసుల త‌యారీ పెరిగింది. ఇది చైనా వ్యాపారాన్ని వేల కోట్ల‌లో దెబ్బేసేసింది. చైనా నుంచి వ‌చ్చే వాహన అమ్మకాలు, బంగారం, నిత్యావసర వస్తువులు ఒక‌ ఎత్తయితే, టపాసుల విక్రయాలు మరో ఎత్తు. అయితే.. చైనాతో వ‌చ్చిన విభేదాల నేప‌థ్యంలో దీపావ‌ళి ట‌పాసుల విస‌యంలో చైనానుంచి దిగుమ‌తి చేసుకోరాద‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే చైనా ట‌పాసుల‌పై పూర్తిగా బహిష్కరించింది.

చైనా వ‌స్తువుల‌పై విధించిన నిషేధం కార‌ణంగా డ్రాగ‌న్ కంట్రీకి ఈ దీపావ‌ళి వేళ సుమారు 50 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ విధానం గ‌త ఏడాది నుంచి ప‌క్కాగా అమ‌లు చేస్తున్న‌ట్టు తెలిపింది.

దేశీయ ఉత్ప‌త్తుల‌కే ప్రాధాన్యం

చైనా దిగుమ‌తుల‌పై నిషేధం కార‌ణంగా.. దేశీయ ఉత్ప‌త్తుల‌కు మార్కెట్ పెరుగుతుంద‌ని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా దీపావళి సీజ‌న్‌లో వినియోగదారులు సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. ఈ సొమ్ములో ప్ర‌తి రూపాయీ.. దేశంలోనే వినియోగం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు.

చైనాపై ఆస‌క్తి త‌గ్గిందా?

గ‌తంలో చైనా ఉత్ప‌త్తుల‌కు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లో డిమాండ్ ఉండేది. అయితే.. ఇటీవ‌ల కాలంలో చైనా దూకుడు త‌ర్వాత‌.. ప్ర‌జ‌లు కూడా ఆ దేశం ప‌ట్ల అప్ర‌మత్తంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే చైనా ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసేందుకు విముఖ త వ్య‌క్తం చేస్తున్నారు.