సిద్ధంకండి.. సెప్టెంబరులో వానలే వానలట
రెగ్యులర్ క్యాలెండర్ కు భిన్నంగా ఈసారి వానల తీరు ఉంది.
By: Tupaki Desk | 1 Sep 2023 4:49 AM GMTరెగ్యులర్ క్యాలెండర్ కు భిన్నంగా ఈసారి వానల తీరు ఉంది. జూన్ వచ్చిందంటే రుతుపవనాలతో జోరు వర్షాలు పడేందుకు భిన్నంగా.. జూన్ లో ఎండలు మండిపోవటం.. జులైలో వానలు ఇరగదీసిన వైనం తెలిసిందే. విడవకుండా కురిసిన వానలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. ఇక.. ఆగస్టులో వాన దేవుడు ముఖం చాటేయటం.. గడిచిన వందేళ్లలో ఇంతటి వర్షాభావ పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఐఎండీ లెక్కల ప్రకారం ఆగస్టులో కురవాల్సిన వర్షాలు కురవకుండా పోవటం.. ఎండలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
గడిచిన వందేళ్లలో ఆగస్టులో ఇత తక్కువ వర్షపాతం పడలేదని చెబుతున్నారు. అయితే.. ఈ నెల (సెప్టెంబరు)లో మాత్రం వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వీకెండ్ లో దక్షిణాదిలోనూ.. మధ్య భారతంలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెప్టెంబరు నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9మి.మీ కాగా.. దానిలో 9 శాతం అటు ఇటుగా పడటం ఖాయమంటున్నారు.
ఎల్ నినో కారణంగా ఆగస్టులో వర్షాలు పడకపోవటం తెలిసిందే. జులైలో అత్యధిక వర్షాలు కురిసి.. ఆగస్టులో వానలు ముఖం చాటేశాయి. ఆరేబియా మహాసముంద్రం.. బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసంతోనే ఇప్పుడు ఎల్ నినో సానుకూలంగా మారినట్లుగా ఐఎండీ అధికారులు చెబుతున్నారు.దీని కారణంగా వర్షాలు పడతాయని.. అదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సో.. ఈ నెలలో భారీ వానలు.. ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందన్న విషయాన్ని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.