Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్ ఇండియా ఇన్ఫో!

భారతదేశం ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డ్ నెలకొల్పింది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:56 AM GMT
ఇంట్రస్టింగ్ ఇండియా ఇన్ఫో!
X

తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రాన్ని, ఉత్తరాన్ని హిమాలయాలు కలిగి ఉన్న భారతదేశం... భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా నిలిచిన.. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


భారతదేశం ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చైనాను వెనక్కి నెట్టింది. దీంతో ఇప్పుడు భారతదేశ జనాభా 144.5 కోట్లు అని చెబుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రతి సంవత్సరం భారత్ లో పుట్టే వారి సంఖ్య.. ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ! ఈ స్థాయిలో భారత్ లో జనాభా పెరుగుదల ఉంటుందని చెబుతారు!

ఇలా సుమారు 144.5 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సుమారు 37 శాతం మంది నగరాల్లో నివసిస్తుండగా.. అత్యధికంగా 63 శాతం మంది గ్రామాల్లో జీవిస్తున్నారు. ఈ మొత్తం జనాభాలో 136 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉండాగా.. ఇంటర్నెట్ యూజర్లు సుమారు 126 కోట్లవరకూ ఉన్నారని సమాచారం! వీరితోపాటు మొబైల్ సబ్ స్క్రైబర్లు 114 కోట్లుగా ఉన్నారు.

భారతదేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96 కోట్లు కాగా.. వీరిలో మహిళలు 47 కోట్లమంది ఉన్నారు. ఇక సోషల్ మీడియా యూజర్లు 50 కోట్లు కాగా, స్టాక్ మార్కెట్ యూజర్లు 9 కోట్ల మందివరకూ ఉన్నారని ఘణాంకాలు చెబుతున్నాయని తెలుస్తుంది!

ఇక ఆవులను దేవతలుగా భావించే భారత దేశంలో వాటి సంఖ్య కూడా ఎక్కువే. ఇందులో భాగంగా... ప్రపంచంలో మొత్తం సుమారు 100 కోట్ల ఆవులుంటే.. వాటిలో సుమారు 20 కోట్లకు పైగా ఇండియాలోనే ఉన్నాయి. ఇక ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం కూడా ఇండియాలోనే ఉంది. అదే... గుజరాత్‌ లోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం.

ఈ క్రమంలోనే ఇండియాలో క్షుద్రపూజలు, వరకట్న వేదింపులు, కాలుష్యం కూడా ఎక్కువే అని చెబుతారు. ఇందులో భాగంగా.. ఇండియాలో ప్రతి గంటకూ ఓ మహిళ వరకట్న వేధింపుల కారణంగా చనిపోతోందని చెబుతుండగా... క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో ప్రతి ఏడాది వెయ్యి మందికి పైగా జనాన్ని చంపుతుంటారంట. ఇక కాలుష్యం విషయానికొస్తే... ముంబైలో ఒక రోజు పీల్చే గాలి 2.5 ప్యాకెట్ల సిగరెట్లతో సమానం అని చెబుతారు.