ఇండియాకు జమిలి ఎన్నికలే బెటరా..!
ఫలితంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటు పడుతోంది. ఉదాహరణకు.. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి
By: Tupaki Desk | 18 April 2024 4:30 PM GMTదేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలే బెటరా? అసెంబ్లీకి, పార్లమెంటుకు కూడా ఒక సారి ఎన్నికలు నిర్వహించ డమే ఉత్తమమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక దశలో ఎన్నికలు జరుగుతుంటే.. రాష్ట్రాల్లో అసెంబ్లీలకు మాత్రం ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నిక లు జరుగుతున్నాయి. దీంతో గడిబిడ వాతావరణం నెలకొంది. గెలిచిన వారు.. పనులు చేసేందుకు ఏదొ ఒక ఎన్నికల కారణంగా.. కోడ్ అడ్డు వచ్చి.. పనులు ముందుకు సాగించలేక పోతున్నారు.
ఫలితంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటు పడుతోంది. ఉదాహరణకు.. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. ఇవి ఏటా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా.. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన రెండేళ్లకు వస్తున్నాయి. దీంతో ఏపీలాంటి రాష్ట్రాల్లో ఐదేళ్లకు నాలుగైదు సార్లు.. కోడ్ అడ్డుగా మారుతోంది. ఫలితంగా ప్రభుత్వాలు కానీ. అభ్యర్థులు కానీ.. అభివృద్ధిచేయాలని అనుకుంటే.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా.. పాదయాత్రలు హంగా మా అంటూ.. హడావుడి చేస్తున్నారు. స్తానిక ఎన్నికల్లోనూ వారు ప్రభావం చూపిస్తున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయకపోతే.. అభివృద్ధి ముందుకు సాగదనే వాదన ఉంది. పైగా. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నికల ఖర్చు కూడా తడిసిపోపెడు అవుతోంది. అదే సమయంలో ఎన్నికలు ఏటా ఉండడంతో పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంలోనూ.. ఎన్నికైన పార్టీలకు ఇబ్బందిగా ఉంది.
అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలతోనే ఐదేళ్ల పాలనలో మెజారిటీ సమయం గడిచి పోతోంది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలు వచ్చేస్తే.. ఇబ్బంది ఉండదని.. ఆరు మాసాల్లోనే ప్రక్రియ పూర్తి అయి.. నాలుగున్నరేళ్ల కాలం అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. దీనినే బీజేపీతన మేనిపెస్టోలోనూ పెట్టింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే.. ఖచ్చితంగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.