Begin typing your search above and press return to search.

స్వచ్ఛమైన గాలులు కలిగిన భారతీయ టాప్ నగరాలివే!

శీతాకాలం ఎంటరైందంటే దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ పరిస్థితి అలానే ఉంది

By:  Tupaki Desk   |   19 Nov 2024 12:30 AM GMT
స్వచ్ఛమైన గాలులు కలిగిన భారతీయ టాప్  నగరాలివే!
X

శీతాకాలం ఎంటరైందంటే దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ పరిస్థితి అలానే ఉంది. ఈ క్రమంలో సోమవారం (18 - నవంబర్)లో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఈ సీజన్ లో గత 24 గంటల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 493 వద్ద నమోదైంది!

అవును... దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హస్తినలో కఠినమైన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీ.ఆర్.ఏ.పీ) - 4 పరిమితులు అమలులో ఉన్నాయి. ఈ సమయంలో 36 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో 13 ఏక్యూఐ రీడింగులు 499 - 500 తీవ్ర స్థాయిలను నివేదించాయి.

ఈ స్టేషన్ లలో ప్రధానంగా... ఇండియా గేట్, నజఫ్ గఢ్, ముండ్కా, సిరి ఫోర్ట్, ద్వారక, నార్త్ క్యాంపస్, పంజాబీ బాగ్, రోహిణి వంటి స్థానాలు ఉన్నాయి. ఈ సమయంలో... నవంబర్ 18 నాటికి భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న నగరాలను ఒకసారి పరిశీలిద్దామ్!

కాంచీపురం - తమిళనాడు (ఏక్యూఐ - 16)

ఐజ్వాల్ - మిజోరం (ఏక్యూఐ - 17)

మదురై - తమిళనాడు (ఏక్యూఐ - 29)

నాగావ్ - అస్సాం (ఏక్యూఐ - 30)

తిరువనంతపురం - కేరళ (ఏక్యూఐ - 34)

సానేగురవ హల్లి - (ఏక్యూఐ - 36)

కోయంబత్తురు - తమిళనాడు (ఏక్యూఐ - 38)

ఎయిర్ క్వాలిటీ ఇండేక్స్ ఎలా విశ్లేషించాలి?:

సాధ్యమయ్యే ఆరోగ్య ప్రభావాలతో పాటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వివిధ వర్గాల విభజనను ఒక సారి పరిశీలిద్దామ్!

0 - 50: గుడ్

51-100: సంతృప్తికరం - సున్నితమైన వ్యక్తులకు చిన్న శ్వాస అసౌకర్యం.

101-200: మితమైనది - ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారికి శ్వాస అసౌకర్యం.

201-300 - పూర్ - చాలా మందికి శ్వాస అసౌకర్యం.

301-400: వెరీ పూర్ - శ్వాసకోస అనారోగ్యం

401-500: తీవ్రమైన పరిస్థితి - ఆరోగ్యవంతమైన వ్యక్తులనూ ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే వ్యాధులు ఉన్నవారిని మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.