Begin typing your search above and press return to search.

అమెరికాలో గోమాతతో గృహ ప్రవేశం... వైరల్ వీడియో!

ఈ సమయంలో గోవును ఇంట్లోకి తీసుకెళ్లి ప్రతి గదిలో తిప్పుతూ మంత్రం జపిస్తారు.

By:  Tupaki Desk   |   1 March 2025 5:23 PM IST
అమెరికాలో గోమాతతో గృహ ప్రవేశం... వైరల్  వీడియో!
X

హిందూ సంప్రదాయం ప్రకారం గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం దగ్గర నుంచి అన్నీ ఆచారబద్ధంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా గోమాతతో గృహప్రవేశం చేయిస్తారు. ఈ సమయంలో గోవును ఇంట్లోకి తీసుకెళ్లి ప్రతి గదిలో తిప్పుతూ మంత్రం జపిస్తారు. అనంతరం ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశిస్తారు.

వాస్తవానికి గోమాతను మహాలక్షి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల గృహప్రవేశ సమయంలో గోవును ఇంట్లోకి తీసుకొచ్చే ముందు పసుపు, కుంకుమ రాసి.. బొట్టు పెట్టి, హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఆ సమయంలో గోవు మూత్రం పోసినా, పేడ వేసినా మరింత శుభకరంగ భావిస్తారు.

అయితే ఈ పద్దతి ఇప్పటికీ పల్లెటూరులో పుష్కలంగా పాటిస్తున్నప్పటికీ.. పట్టణాల్లో మాత్రం ఆచరించలేకపోతున్నారని అంటున్నారు. ప్రధానంగా.. పట్టణపు వాసులు ఎక్కువగా అపార్ట్ మెంట్స్ లో ఉండటం వల్ల.. ఈ విధానం ఆచరించాలని అనుకున్నా ప్రాక్టికల్ గా సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. కొంతమంది కావాలనే లైట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో అమెరికాలోని గృహప్రవేశం గోమాతతో చేయించడం గమనార్హం.

అవును... ఏ దేశమేగినా ఎందుకాలిడినా సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోకూడదని భావించారో ఏమో కానీ... తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆవుతో నిర్వహించారు.. సంప్రదాయాలను గుర్తుచేశారు. దీంతో.. ఈ విషయం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.