Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ నడిబొడ్డున భారత మువ్వన్నెల జెండా రెపరెపలు

పాకిస్థాన్ లో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఓ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈవెంట్ జరగడం దాదాపు 30ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   27 Feb 2025 5:05 PM IST
పాకిస్థాన్ నడిబొడ్డున భారత మువ్వన్నెల జెండా రెపరెపలు
X

శత్రు దేశంలో మన జాతీయ జెండా రెపరెపలాడుతుంటే.. వచ్చే ఆ కిక్కే వేరప్పా.. అది కూడా మన నుంచి విడిపోయి మనతోనే శత్రుత్వం పెంచుకుని.. మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన దేశం అయితే..? ఇక చెప్పేదేముంది..? ఇప్పుడు అదే జరిగింది. పాకిస్థాన్ నడిబొడ్డున త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. అదెలాగంటే..?

పాకిస్థాన్ లో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఓ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈవెంట్ జరగడం దాదాపు 30ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్ కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే. కానీ, టీమ్ ఇండియా మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నాయి.

ఏదైనా ఐసీసీ టోర్నీ సందర్భంగా అందులో పాల్గొనే అన్ని దేశాల జాతీయ జెండాలను టోర్నీ జరిగే స్టేడియాల వద్ద ఎగురవేస్తారు. బుధవారం ఇంగ్లండ్-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ లోని లాహోర్ నగరం గడాఫీ స్టేడియంలో ఇలాగే అన్ని దేశాల జాతీయ జెండాలను ఎగురవేశారు.

చాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు ఆడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎగురవేసిన జాతీయ జెండాల్లో భారత జాతీయ జెండా పక్కన బంగ్లాదేశ్, ఆ తర్వాత పాకిస్థాన్ జాతీయ జెండాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ రెండూ మన దేశంలోనివే కావడం గమనార్హం.

మిగతా ఐదు దేశాల జాతీయ జెండాలు కూడా ఎగురవేసినా.. పాకిస్థాన్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరడం అనేది ఎంతైనా గూస్ బంప్స్ తెప్పించే విషయమే కదా..?

కొసమెరుపు: పాక్ గడ్డపై భారత జెండా ఎగురుతోంది సంతోషమే. మరి 2023 అక్టోబరు-నవంబరులో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరిగింది. ఇదీ ఐసీసీ టోర్నీనే. అంటే నిబంధనల ప్రకారం మన దేశంలోనూ పాకిస్థాన్ జెండాను ప్రదర్శించి ఉంటారు కదా? ఏమో మనం గమనించి ఉండం.