Begin typing your search above and press return to search.

గ్రీస్ లో ఇళ్ల కొనుగోలుకు క్యూ కట్టిన భారతీయులు... కారణం ఇదే!

అవును... జూలై - ఆగస్టు మధ్యాకాలంలో గ్రీస్ లో భారతీయ పెట్టుబడిదారులు ప్రోపర్టీ కనుగోళ్లలో 37 శాతం పెరుగుదల కనిపించింది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 7:30 PM GMT
గ్రీస్  లో ఇళ్ల కొనుగోలుకు క్యూ కట్టిన భారతీయులు... కారణం ఇదే!
X

గ్రీస్ లో ఇళ్ల కొనుగోలు కోసం భారతీయ ఇన్వెస్టర్లు ఎగబడ్డారని.. ఫలితంగా... జూలై - ఆగస్టు మధ్య కాలంలో అక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన భారతీయ ఇన్వెస్టర్ల సంఖ్య ఏకంగా 37 శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక్కసారిగా ఇంతలా ఇళ్ల కొనుగోళ్లు పెరగడానికి గల కరణం... మారిన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్!

అవును... జూలై - ఆగస్టు మధ్యాకాలంలో గ్రీస్ లో భారతీయ పెట్టుబడిదారులు ప్రోపర్టీ కనుగోళ్లలో 37 శాతం పెరుగుదల కనిపించింది. సెప్టెంబర్ 1న తీసుకొచ్చిన నిబంధనల పరిమితి అమల్లోకి రాకముందే ఇళ్ల కనుగోళ్లపై భారతీయ ఇన్వెస్టర్లు త్వరపడ్డారు. ఈ క్రమంలో... పెద్ద సంఖ్యలో ప్రాపర్టీలను సొంతం చేసుకున్నారు.

దీనికి ప్రధాన కారణం... రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడం కోసం ఆ దేశం 2013లో ప్రవేశ పెట్టిన "గోల్డెన్ వీసా ప్రోగ్రామ్మ్". ఈ స్పెషల్ స్కీమ్మ్ కింద విదేశీ పౌరులు 2,50,000 యూరోలు (దాదాపు రూ.2.2 కోట్లు) కనీస ప్రోపర్టీ పెట్టుబడితో శాస్వత నివాసాన్ని పొందవచ్చు. అయితే డిమాండ్ పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలూ పెరిగాయి.

ప్రధానంగా... ఏథెన్స్, మైకోనోస్, థెస్సలోనికీ, సాంటోరిని వంటి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ భారీగా పెరిగింది. ఈ సమయంలో దీనికి పరిష్కరించడానికి గ్రీస్ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లోని ఆస్తుల కోసం పెట్టుబడి థ్రెషోల్డ్ ను 8,00,000 యూరోలకు (దాదాపు రూ.7 కోట్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిబంధనను సెప్టెంబర్ 1 - 2024 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పరిమితి అమల్లోకి రాకముందే సెప్టెంబర్ 1లోపే ఇళ్ల కొనుగోళ్లకు ఇండియన్ ఇన్వెస్టర్లు త్వరపడ్డారు.

ఈ విషయాలపై స్పందించిన లెప్టోస్ ఎస్టేట్స్ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ సంజయ్ సచ్ దేవ్... ఇటీవల నెలల్లో భారతీయ పెట్టుబడిదారులు.. ఆరు నుంచి పన్నెండు నెలల్లో హ్యాండ్ ఓవర్ చేసేలా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.