Begin typing your search above and press return to search.

బేబీ 81కి 20 ఏళ్లు.. ఈ సునామి బాబు గురించి మీకు తెలుసా..?

ఆ సునామీ కారణంగా హాస్పిటల్ లో ఎంతోమంది పేషెంట్స్ జాయిన్ అవగా ఆ బాబుకి 81 నెంబర్ కేటాయించారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 11:30 PM GMT
బేబీ 81కి 20 ఏళ్లు.. ఈ సునామి బాబు గురించి మీకు తెలుసా..?
X

20 ఏళ్ల క్రితం ఇండియా, ఇండోనేషియా తో పాటు వివిధ దేశాల్లో సునామి వచ్చిన సందర్భం అది.. ఆ టైం లో శ్రీలంకలో కూడా తీవ్రంగా సునామి వచ్చింది. ఎక్కడక్కడ మట్టిదిబ్బలు ఏర్పడ్డాయి. ఆ సునామిలో మట్టిలో రెండు నెలల చిన్నారి జయరస అభిలాష్ మృత్యుంజయుడిగా నిలిచాడు. అతన్నే బేబీ 81గా పిలుస్తారు.. ఆ సునామి టైం లో జరిగిన విషయాలను అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఐతే ఆ టైం లో 3 రోజులు ఏమీ తినకుండా రెండు నెలల బాలుడు బ్రతికి బట్టకట్టడం ప్రపంచమంతా అవాక్కయ్యేలా చేసింది. అప్పటి ఆ సెన్సేషన్ వార్త గురించి ఇప్పుడు మళ్లీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇండియా, ఇండోనేషియాతో పాటుగా శ్రీలంకలో కూడా సునామి ప్రభావం చాలా దెబ్బ వేసింది. శ్రీలంకలో ఆ సునామి వల్ల దాదాపు 35వేల మంది మృతి చెందారు. చాలామంది కుటుంబాల నుంచి విడిపోయారు. ఆ సునామిలోనే రెండు నెలల బాబు కొట్టుకెళ్లాడు. విషయం తెలిసిన అధికారులు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఆ బాబు కోసం 3 రోజుల దాకా వెతికారు. ఎంత వెతికినా అతను దొరకలేదు. ఇక దాదాపు అందరు ఆశలు వదులుకున్న తర్వాత అక్కడే ఒక ఇంటి దగ్గర్లో మట్టిలో కూరుకుపోయి చిన్నగా కదులుతున్న ఆ బాబుని గుర్తించి బయటకు తీసి హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

ఆ సునామీ కారణంగా హాస్పిటల్ లో ఎంతోమంది పేషెంట్స్ జాయిన్ అవగా ఆ బాబుకి 81 నెంబర్ కేటాయించారు. దాని వల్లే అతనికి బేబీ 81గా పేరు వచ్చింది. ఐతే బాబు బ్రతికాడని తెలియగానే అతను మా వాడు అంటూ 9 ఫ్యామిలీలు వచ్చాయి. వారిలో అసలు తల్లిదండ్రులు ఎవరన్నది కేసు వేసి విచారణ నిర్వహించారు. ఎప్పటికీ ఆ కేసు తేలకపోవడంతో చివరకు డి.ఎన్.ఏ పరీక్షల ద్వారా జయసర అభిలాష అసలు పేరెంట్స్ కి అతన్ని అప్పగించారు. ఆ చంటి బాబు ఇప్పుడు 20 ఏళ్ల యువకుడిగా మారాడు. ప్రస్తుతం అతను ప్లస్ 2 పూర్తి చేసి పరీక్షలకు రెడీ అవుతున్నాడు. బేబీ 81 గురించి ఎప్పుడు తలచుకున్నా కళ్లు చమ్మగిల్లుతాయని తండ్రి మురుగుపిళ్లై చెప్పుకొచ్చారు.