Begin typing your search above and press return to search.

ఆ యువతి మృతిపై దర్యాప్తు పూర్తి.. కెనడా పోలీసుల కీలక ప్రకటన

ఆమె మృతిపై ఆమె తల్లితోపాటు సహోద్యోగులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 9:17 AM GMT
ఆ యువతి మృతిపై దర్యాప్తు పూర్తి.. కెనడా పోలీసుల కీలక ప్రకటన
X

కొద్ది రోజుల క్రితం కెనడాలో భారత సంతతి యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె మృతిపై ఆమె తల్లితోపాటు సహోద్యోగులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఆ యువతి మరణంపై కెనడా కీలక ప్రకటన చేసింది.

పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్ రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పనిచేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటున్నారు. గతనెలలో వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానస్పదంగా శవమై కనిపించింది.

సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ముందుగా తోటి ఉద్యోగులు స్టోరీ మొత్తం వెతికాడు. కానీ.. ఆమె ఆచూకీ దొరకలేదు. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించారు. స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూశారు. అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. కాగా.. సిమ్రన్ మృతిపై ఆమె తల్లి ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. సిమ్రన్‌ను కావాలనే ఎవరో అందులోకి నెట్టేసి హత్య చేశారని ఆరోపించారు. వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు తెలిపారు.

దీనిపై హాలీఫాక్స్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, అనుమానాస్పద హత్యగా కనిపించలేదని వెల్లడించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందో అనే దానిపై చాలా మంది చాలా ప్రశ్నలు వెల్లువెత్తారు. కానీ.. తమ విచారణలో ఎలాంటి అనుమానులేవని తెలిపారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు ఇంతటితో పూర్తయిందని తెలిపారు.