Begin typing your search above and press return to search.

కెనడాలో భారతీయ విద్యార్థుల దుస్థితి.. వైరల్ అవుతున్న వీడియో..

అవుట్ లెట్ పోస్ట్ చేసిన ఓ ప్రకటనకు ప్రతిస్పందనగా కెనడా,బ్రాంప్టన్‌లోని రెస్టారెంట్ బయట ఏకంగా మూడు వేల మంది భారతీయు విద్యార్థులు క్యూలో గంటల తరబడి నిలబడ్డారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 6:53 AM GMT
కెనడాలో భారతీయ విద్యార్థుల దుస్థితి.. వైరల్ అవుతున్న వీడియో..
X

సాంకేతికత పెరుగుతున్న కొద్ది ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నప్పటికీ పెరుగుతున్న జనాభా దృశ్య అందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతుంది. కొన్ని దేశాలలో ప్రవాస భారతీయుల పరిస్థితి మరి దారుణంగా తయారవుతుంది.

భారతదేశ నుంచి ఇతర దేశాలకు విద్య ,ఉద్యోగ అన్వేషణలో వెళ్లే వారి సంఖ్య ప్రతిరోజు ఘననీయంగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా యూఎస్, యూకే లాంటి దేశాలకు వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతగా పాపులర్ అయింది అంటే ప్రతి ఇంట్లో కనీసం ఎవరో ఒకరు విదేశాలలో సెటిలై ఉంటారు. అయితే పెరుగుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య కారణంగా విదేశాలలో కూడా గట్టి పోటీ ఏర్పడుతోంది.

ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అక్కడక్కడ తన ప్రభావాన్ని గట్టిగా చూపిస్తోంది. దానికి తోడు పెరిగిన జనాభా.. అని కలిపి చూసుకుంటే విద్యార్థులకు చాలా కష్టమైన కాలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెనడా నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రస్తుతం విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కంటికి కట్టినట్టుగా చూపిస్తోంది.

అవుట్ లెట్ పోస్ట్ చేసిన ఓ ప్రకటనకు ప్రతిస్పందనగా కెనడా,బ్రాంప్టన్‌లోని రెస్టారెంట్ బయట ఏకంగా మూడు వేల మంది భారతీయు విద్యార్థులు క్యూలో గంటల తరబడి నిలబడ్డారు. ఇంతకీ వాళ్ళని పిలిచింది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి అనుకుంటున్నారేమో.. వెయిటర్, సర్వెంట్ లాంటి ఉద్యోగాల కోసమే ఈ తతంగం. ఓ రెస్టారెంట్లో వెయిటర్, సర్వెంట్ ఉద్యోగాల కోసం పోస్ట్ చేసిన ఓ యాడ్ ను చూసి 3000 మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టారు అంటే వారి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.

ప్రస్తుతం కెనడాలో ఉద్యోగ సంక్షోభం ఏ రేంజ్ లో ఉందో.. దానికి భారతీయ విద్యార్థులు ఎలా బలి అవుతున్నారో ఈ వీడియో తెలియచేస్తుంది. పక్కింటివారు, ఎదురింటి వారు తమ పిల్లలను విదేశాలకు పంపించారు కాబట్టి మీరు కూడా పంపించాలి అన్న ఉద్దేశంతో మీ పిల్లల జీవితాన్ని బలి చేయకండి. ఇండియాలో చదువుకొని కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. మీ పిల్లలను విదేశాలకు పంపేటప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. వాళ్లకు అక్కడ అన్ని అందుబాటులో ఉంటాయా.. ఆ ప్లేస్ సేఫా కాదా అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.