Begin typing your search above and press return to search.

షాకింగ్... ఆ 20 వేల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చేస్తున్నది అదా?

ఇందులో భాగంగా... 2024కి సంబంధించి కెనడా కాలేజీలలో ప్రవేశాలు పొందిన సుమారు 20,000 మంది భారతీయ విద్యార్థులు క్లాస్ లకు హాజరు కావడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Jan 2025 5:40 AM GMT
షాకింగ్... ఆ 20 వేల మంది భారతీయ విద్యార్థులు  కెనడాలో చేస్తున్నది అదా?
X

విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... 2024కి సంబంధించి కెనడా కాలేజీలలో ప్రవేశాలు పొందిన సుమారు 20,000 మంది భారతీయ విద్యార్థులు క్లాస్ లకు హాజరు కావడం లేదని అంటున్నారు. దీంతో.. వీరంతా ఏమి చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది.

అవును... కెనడా కాలేజీలలో అడ్మిషన్స్ పొందిన భారతీయ విద్యార్థులు సుమారు 20,000 మంది వరకూ క్లాస్ లకు అటెండ్ కావడం లేదనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో... వీళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు.. ఏమి చేస్తున్నారు అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సమయంలో ఓ ఆసక్తికర సమాధానం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... వీరంతా స్వదేశంలో తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్స్ తీర్చడం కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారని అంటున్నారు. కెనడాలో పని చేయడం ద్వారా స్వదేశంలో విద్యా రుణాలను క్లియర్ చేయడం సులువవ్వడంతో పాటు జీవనోపాధికీ సహాయపడుతుందని ఈ ఆలోచన అని అంటున్నారు.

అయితే... కెనడాలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి హామీ లేకపోవడం, జాబ్ మార్కెట్ లో అనిశ్చితి కారణంగా చాలామంది భారతీయ విద్యార్థులతో పాటు పలు దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా సంపాదించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై కెనడా పౌరుల నుంచి ఘాటైన రియాక్షన్స్ వస్తుండటం గమనార్హం.

ఇలా భారతదేశం నుంచి చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు.. కాలేజీలకు అటెండ్ అవ్వడం మానేసి, ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ దీనిపై కెనడియన్ పౌరులు స్పందిస్తున్నారు. ఇది నిజంగా షాకింగ్ విషయమని అంటున్నారు. ఇది చట్టవిరుద్ధం అని నొక్కి చెబుతున్నారు.

అసలు భారతీయ విద్యార్థులు ఏ విధంగానైనా యూఎస్, కెనడాలలో అడుగుపెట్టాలని, స్థిరపడాలని వారి వారి తల్లితండ్రులపై ఎందుకు భారీ రుణాల భారం మోపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఏదైనా కన్సలెంట్ ఈ తరహా విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లయితే మరో ఆలోచన లేకుండా వారంతా బహిష్కరించబడతారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కొత్త విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 20,000 మంది వరకూ విద్యార్థులు ఇలా చదువు పేరున విదేశాలకు వెళ్లి, కాలేజీలు ఎగ్గొట్టి పార్ట్ టైమ్ పనులు చేసుకోవడం షాకింగ్ గా మారిందని అంటున్నారు.